ఫోన్ నంబర్ల మార్పుపై స్పందించిన 'డీవోటీ'..
- February 21, 2018
త్వరలో 10 సంఖ్యలుగా ఉన్న మొబైల్ నంబర్‌ను 13 సంఖ్యలకు మారుస్తున్నట్టు బుధవారం సోషల్ మీడియాలో విపరీత ప్రచారం జరిగింది. ఇక దీనిపై బుధవారమే స్పందించిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీవోటీ) ఆ ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. కేవలం మెషిన్ టు మెషిన్(ఎం2ఎం) కు మాత్రమే భద్రతా కారణాలరీత్యా 10 సంఖ్యలను 13 కు మారుస్తున్నట్టు వెల్లడించింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ సంచార నిగమ్ లిమిటెడ్ BSNL కూడా నంబర్ల మార్పు ఉండదని ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. మరింత భద్రత కోసం వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎం2ఎం సిమ్‌లలో 13 సంఖ్యల నంబర్‌ను జూలై 1 నుంచి జారీ చేయాలని డీవోటీ అన్ని టెలికం కంపెనీలను జనవరిలో ఆదేశించింది. అందులో భాగంగానే ఈ ప్రచారం జరిగింది ఇది కేవలం మెషిన్ టు మెషిన్ (ఎం2ఎం) సిమ్ లకు మాత్రమే వర్తిస్తుందని సాధారణ ఫోన్ నంబర్లలో ఎటువంటి మార్పు ఉండదని తెలిపింది. దీంతో వినియోగదారులు ఊపిరి పీల్చుకున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







