బాలిక పట్ల డ్రైవర్ వెకిలి చేష్టలు...కేసు నమోదు
- February 22, 2018
దుబాయ్ : బతుకు తెరువు కోసం దేశం కానీ దేశంలో జీవిస్తున్నవారు .పద్ధతిగా లేకపోతే పలు ఇబ్బందులు ఎదుర్కోవాలి. చేసిన తప్పుడు పనికి .ఏ ఒక్కరు మద్దతు ఇవ్వరని గ్రహించాలి. దుబాయిలో అమ్మాయి పట్ల ఓ డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఒక యజమాని వద్ద డ్రైవర్ వద్ద పనిచేస్తున్నాడు. ఇటీవల ఆ డ్రైవర్ కు మరో కొత్త డ్యూటీ యజమాని అప్పగించాడు. రోజూ పాఠశాలకు వెళ్లి యజమాని 16 ఏళ్ల కుమార్తెను క్షేమంగా ఇంటికి తీసుకురావాల్సిన బాధ్యతని అప్పచెప్పారు. నలభై ఏళ్ళ డ్రైవర్ ను ఇందుకై నియమించారు. కుమార్తె వయస్సు ఉన్న ఆ అమ్మాయిని స్కూల్‌కు తీసుకెళ్లి ఇంటికి నమ్మకంగానే తీసుకొస్తున్నాడు..బాలిక తల్లిదండ్రులు సైతం ఆ డ్రైవర్ ను పూర్తిగా నమ్మారు. ఈ నెల 19 వ తేదీ సాయంత్రం ఆ స్నేహితుల ఇంట్లో పార్టీ ఉండటంతో ఆ అమ్మాయి డ్రైవర్‌ను వెంట పెట్టుకుని కారులో ఆ ఇంటికి వెళ్లింది. పార్టీ ముగిసే సరికి చాలా ఆలస్యం అయింది. ఇంటికి బయలుదేరారు. అయితే వెళ్ళేదారిలో డ్రైవర్ ఆ అమ్మాయి పట్ల వెకిలి వేషాలు వేయడం ప్రారంభించాడు. పక్కన కూర్చోని ఉన్న అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో ఆ అమ్మాయి బెదిరిపోయింది.. కారు ఆపమని గట్టిగా కేకలు వేసింది..కారు ఆపకపోతే వేగంగా వెళుతున్నకారులో నుంచి రోడ్డుపైకి దూకే యత్నం చేసింది. భయపడిన డ్రైవర్ కారుని నిలిపాడు. ఫోన్ ద్వారా డ్రైవర్ వ్యవహార శైలి గూర్చి తన తండ్రికి మొత్తం పూసా గుచ్చినట్లు చెప్పింది. దీంతో తన పని పడతారని భయపడిన ఆ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ యువతీ తండ్రి ఈ డ్రైవర్ గూర్చి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు. నిందితుడి కోసం పాలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి