ఫుజారియాలో టాక్సీ డ్రైవర్ సహకారంతో మహిళను రక్షించిన పోలీసులు
- November 27, 2015
నిన్న గురువారం ఉదయం ఫుజారియాలో టాక్సీలో ఉన్న25 సంవత్సరాల ఆసియా మహిళను బయటకు లాగి, అపహరించాలని చూసిన ఇద్దరు గల్ఫ్ పౌరులను, టాక్సీ డ్రైవరు సహకారంతో పోలీసులు పట్టుకున్నారు. ఆ మహిళను అపహరించాలని చూసిన వారితో ఆమె పోరాడుతూ గట్టిగా అరిచిందని, వారెవరో ఆమెకు తెలియదని, వారు ఆమెను తమ వాహనం లోకి లాక్కుపోయారని టాక్సీ డ్రైవరు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కేవలం ఒక గంట సమయంలో వారిని పట్టుకుని నిర్బంధం లోకి తీసుకున్నారు. నిందితులు నేరాన్ని ఒప్పుకున్నారని, వారిని ఫుజారియా పబ్లిక్ ప్రాసిక్యూషన్ వారికి అప్పగించామని వారు వివరించారు. రికార్డు సమయంలో నేరస్తులను వెతికి పట్టుకున్న పోలీసు మరియు నేర పరిశోధక శాఖ వారిని డైరక్టర్ ఆఫ్ పోలీస్ ఆపరేషన్స్ బ్రిగేడియర్ హుమైద్ మొహమ్మద్ అల్ యమాహి ప్రశంసించారు.
తాజా వార్తలు
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు







