మోస్ట్‌ వాంటెడ్‌ నిందితుడ్ని కేరళ పోలీసులకు అప్పగింత

- February 24, 2018 , by Maagulf

మనామా: వెకేషన్‌లో స్వదేశానికి వెళ్ళ అక్కడ హత్యకు పాల్పడిన ఓ నిందితుడ్ని బహ్రెయిన్‌ పోలీసులు, కేరళ పోలీసులకు అప్పగించారు. 28 ఏళ్ళ అరుణ్‌ కరుణాకరన్‌, 66 ఏళ్ళ పివి జానకి అనే రిటైర్డ్‌ స్కూల్‌ టీచర్‌ని అత్యంత కిరాతకంగా చంపేశాడు. అయితే పోలీసుల్ని, ప్రజల్ని మిస్‌లీడ్‌ చేసిన నిందితుడు, బహ్రెయిన్‌కి ఫిబ్రవరి 4న చేరుకున్నాడు. గత రెండేళ్ళుగా బహ్రెయిన్‌లో పనిచేస్తున్నాడు అరుణ్‌ కరుణాకరన్‌. డిసెంబర్‌ 13న కేరళలోని చీమెని గ్రామంలో హత్య జరిగింది. పోలీసులు విచారణ జరిపి, నిందితుడ్ని గుర్తించారు. బహ్రెయిన్‌ పోలీసులకు, కేరళ పోలీసులు సమాచారమందించడంతో, బహ్రెయిన్‌ పోలీసులు నిందితుడ్ని తాజాగా కేరళ పోలీసులకు అప్పగించడం జరిగింది. సోషల్‌ వర్కర్‌ సబైర్‌ కన్నుర్‌, నిందితుడితో మాట్లాడగా, నేరాన్ని అంగీకరించారు. నిందితుడితో కలిసి సబిర్‌ కన్నుర్‌ కేరళకు వెళ్ళి, పోలీసులకు అతన్ని అప్పగించడం జరిగింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com