హెచ్ 1బీ వీసాపై రెజల్యూషన్
- February 25, 2018
వాషింగ్టన్: అమెరికన్లు, వలసేతర కార్మికుల వేతనాలు, పరిస్థితుల్ని మెరుగుపర్చేందుకే ట్రంప్ యంత్రాంగం కొత్త హెచ్1బీ వీసా పాలసీని తీసుకొచ్చిందని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) శనివారం తెలిపింది. అమెరికాలో కొన్ని సంస్థలు ఉద్యోగులకు ఇవ్వాల్సిన దానికన్న తక్కువ వేతనాలు చెల్లించడం, ఖాళీగా కూర్చోబెట్టడం, నైపుణ్యానికి సంబంధంలేని పనుల్ని అప్పగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని యూఎస్సీఐఎస్ వెల్లడించింది. ఇలాంటి మోసాలను అరికట్టేందుకే కొత్త హెచ్1బీ విధానాన్ని తీసుకొచ్చామని వివరించింది. ఫిబ్రవరి 22 నుంచి అమల్లోకి వచ్చిన ఈ విధానం ప్రకారం థర్డ్ పార్టీ వర్క్సైట్లలో కాంట్రాక్ట్ కాలపరిమితి మేరకే హెచ్1బీ వీసాను జారీచేస్తారు. అమెరికన్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) గురువారం జారీ చేసిన ఏడు పేజీల తాజా పాలసీ ప్రకారం థర్డ్ పార్టీ వర్క్‌సైట్‌లో ఎంత కాలం పనుంటే అంత కాలానికే హెచ్-1బీ వీసాలు జారీ చేస్తారు. ఇప్పటిదాకా మూడేళ్ల కాలానికి హెచ్-1బీ వీసాల్ని జారీచేస్తుండగా. ఇక నుంచి అంతకంటే తక్కువ కాలానికే జారీ చేయనున్నారు. 2019 ఆర్థిక సంవత్సరానికి హెచ్-1బీ వీసా దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 2 నుంచి ప్రారంభం కానుందన్న వార్తల నేపథ్యంలో ఈ పాలసీని కొత్తగా అమెరికా తెరపైకి తెచ్చింది.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







