సౌదీఅరేబియాలో వడగండ్ల వాన .... తీవ్ర ఇబ్బందులు పడిన ప్రజలు
- February 25, 2018
రియాద్: " వానా ..వానా వల్లప్పా ..వడగండ్ల వాన పడితే మాత్రం నెత్తికి చిల్లప్పా " సౌదీ అరేబియావాసులు వడగండ్ల వాన ధాటికి వాపోతున్నారు. యాపిల్ ఆకారంలో తెల్లని వడగండ్లు పెద్ద చప్పుడుతో కురవడంతో పలు వాహనాల అద్దాలు పగిలిపోయాయని అధికారులు తెలిపారు. నాజ్రన్ పట్టణంలోనూ, రాజధాని నగరం రియాద్‌లోనూ వడగండ్ల వాన భారీగా కురిసిందని పేర్కొన్నారు.. అయితే నాజ్రన్ పట్టణంలో వర్షం కురిసే ముందే తీవ్ర దుమ్ముతో వడగాలులు చెలారేగాయని అధికారులు తెలిపారు. దాంతో ప్రజలకు భారీ వర్షం కురవబోతున్నట్లు హెచ్చరికలు జారీ చేశామన్నారు. దుమ్ము చెలారేగడంతో వాహనాదారులకు సరిగ్గా రోడ్డు కనపడలేదన్నారు. అందువల్ల కొన్ని ప్రాంతాలలో రోడ్డు ప్రమాదాలు సైతం జరిగాయని అధికారులు తెలిపారు. అయితే స్థానికులు వడగండ్ల వాన కురుస్తుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
తాజా వార్తలు
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్‌లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్‌లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్‌తో భేటీ అయిన నెతన్యాహు..







