అగ్రకథానాయకులతో ఓ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కిస్తా
- February 26, 2018
చిరంజీవి, బాలకృష్ణతో మల్టీస్టారర్ తెరకెక్కిస్తా
'అ!' దర్శకుడు ప్రశాంత్ వర్మ
హైదరాబాద్: అనుభవజ్ఞుడు కాకపోయినా 'అ!'ద్భుతమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. నాని నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, నిత్యామేనన్, ఈషా రెబ్బా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. తనకు చిరంజీవి, బాలకృష్ణ లాంటి అగ్రకథానాయకులతో ఓ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కించాలని ఉందని ప్రశాంత్ వర్మ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
'నేను స్కూల్లో టాపర్. చదువుతో పాటు సినిమాలపైనా ఆసక్తి ఉండేది. ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడు మ్యూజిక్ వీడియోలు చిత్రీకరించేవాడిని. 'దీనమ్మ జీవితం' టైటిల్‌తో నా తొలి లఘు చిత్రాన్ని తెరకెక్కించాను. ఇది యూట్యూబ్‌లో విపరీతంగా వైరలైంది. ఆర్కుట్ ఉన్న రోజుల్లో ఈ లఘుచిత్రానికి పది లక్షల మందికిపైగా వీక్షించారు. అలా లఘుచిత్రాలతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాను'
'నందమూరి బాలకృష్ణతో కమర్షియల్ చిత్రం తెరకెక్కించాలనుకుంటున్నాను. అన్నీ అనుకున్నట్లు కుదిరితే భవిష్యత్తులో ఆయనతో కలిసి తప్పకుండా పనిచేస్తాను. 'అ!' చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే మెగాస్టార్ చిరంజీవికి కథ వినిపించే అవకాశం వచ్చింది. కానీ మొన్న మొన్ననే వచ్చిన నాకు చిరంజీవి లాంటి అగ్రకథానాయకుడితో కలిసి పనిచేయడం రిస్కీ అనిపించింది. కుదిరితే బాలకృష్ణ, చిరంజీవితో మల్టీస్టారర్ తెరకెక్కిస్తాను' అని చెప్పుకొచ్చారు ప్రశాంత్ వర్మ.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







