లైంగిక వేధింపులు: బాస్‌ని హత్య చేసిన వ్యక్తి

- February 26, 2018 , by Maagulf
లైంగిక వేధింపులు: బాస్‌ని హత్య చేసిన వ్యక్తి

కంపాట్రియేట్‌ మేనేజర్‌ని హత్య చేసిన ఘటనలో ఓ వ్యక్తికి న్యాయస్థానం ఏడేళ్ళ జైలు శిక్ష విధించింది. శిక్ష పూర్తయ్యాక, దేశం నుంచి అతన్ని డిపోర్ట్‌ చేయాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది. 22 ఏళ్ళ పాకిస్తానీ కార్మికుడు, తన పై అధికారి అయిన సూపర్‌వైజర్‌పై దాడి చేశాడు. ఆ దాడికి కారణం, సూపర్‌వైజర్‌ లైంగికంగా పాకిస్తానీ కార్మికుడ్ని దూషించడమే. ఘటన వివరాల్ని తెలియజేస్తూ, ఒక రోజు తన బాస్‌ తనని పార్కింగ్‌ లాట్‌లో కలిశారనీ, తన పట్ల లైంగిక వాంఛని అతని వ్యక్తం చేయగా, దాన్ని తాను తిరస్కరించాననీ, ఈ నేపథ్యంలో అతను తనను అవమానించడమే కాక, బెదిరింపులకు దిగాడనీ, ఆ తర్వాత తాను సూపర్‌ మార్కెట్‌ వద్దకు వెళ్ళి కత్తిని కొనుగోలు చేశాననీ, కార్‌ పార్కింగ్‌ ఏరియాలో ఇంకోసారి తనను చూసిన బాస్‌, తన మీద లైంగిక దాడికి ప్రయత్నించగా, ఆగ్రహం తట్టుకోలేక అతన్ని పొడిచానని నిందితుడు చెప్పాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com