45 రోజులు మూతపడనున్న దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌ రన్‌ వే

- February 26, 2018 , by Maagulf
45 రోజులు మూతపడనున్న దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌ రన్‌ వే

దుబాయ్‌ ఎయిర్‌ పోర్ట్స్‌, దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ (డిఎక్స్‌బి) సదరన్‌ రన్‌ వే 45 రోజులపాటు మూసివేయబడ్తున్నట్లు వెల్లడించింది. భద్రతను పెంచేందుకు, సర్వీస్‌ మరియు కెపాసిటీ లెవల్స్‌ని పెంచేందుకుగాను పలు అభివృద్ధి కార్యక్రమాల్ని చేపట్టనున్న దరిమిలా ఈ మూసివేతను అమల్లోకి తీసుకొస్తున్నారు. రోజుకి 1,100 విమానాల మూమెంట్‌తో నిత్యం బిజీగా వుంటుంది దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం. 60,000 టన్నుల అఫ్సాల్ట్‌, 8,000 టన్నుల కాంక్రీట్‌తో ఈ అభివృద్ధి పనుల్ని చేపడతారు. ఈ క్రమంలోనే 800 కిలోమీటర్ల పొడవైన ప్రైమరీ కేబుల్స్‌ని ఏర్పాటు చేయడం, 5,500 రన్‌ వే లైట్స్‌ని సరికొత్తగా తీర్చిదిద్దడం వంటి పనులు జరుగుతాయి. ఏప్రిల్‌ 16 నుంచి మే 30 వరకు ఈ పనులు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లను దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఇప్పటికే సిద్ధం చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com