రెండు తలల శిశువు వైద్య చికిత్సకు అజ్మన్ రూలర్ అండదండలు
- February 26, 2018
మెంబర్ ఆఫ్ సుప్రీం కౌన్సిల్, అజ్మన్ రూలర్ షేక్ హుమైద్ బిన్ రషీద్ అల్ నౌమి, రెండు తలలతో పుట్టిన చిన్నారికి వైద్య చికిత్స చేయించేందుకు ముందుకొచ్చారు. మలక్ పేరుగల ఆ చిన్నారికి వైద్య చికిత్స మాత్రమే కాకుండా, ఓ ఇంటిని కూడా అందించారు. ఆ చిన్నారి తండ్రికి ఎంప్లాయిమెంట్‌ని కూడా షేక్ హుమైద్ కల్పించారు. అజ్మన్ రూలర్ పర్సనల్ సెక్రెటరీ హమాద్ బిన్ ఘలైటా అల్ గాఫ్లి మాట్లాడుతూ, న్యూస్ పేపర్‌లో చిన్నారి దయనీయ స్థితిని గురించి చదివి, రూలర్‌కి తెలియజేశానని చెప్పారు. వెంటనే మొరాకోలోని యూఏఈ ఎంబసీతో షేక్ హుమైద్ మాట్లాడి, చిన్నారి వైద్య చికిత్సకు అయ్యే ఖర్చులన్నీ భరించాలని ఆదేశించినట్లు చెప్పారాయన. చిన్నారి కుటుంబం, షేక్ హుమైద్ అందించిన సాయం పట్ల ఆనందోత్సాహాల్ని వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!







