సిరియాలో రసాయనిక దాడులు !
- February 26, 2018
- గౌటాలో పౌరులను బంధీలుగా మల్చుకున్న వైపీజీ : రష్యా రక్షణ శాఖ
మాస్కో : సిరియాలో రసాయనిక దాడులకు పాల్పడేం దుకు తిరుగుబాటుదారులు కుట్ర పన్నారని రష్యా రక్షణ శాఖ పేర్కొన్నది. గౌటా నగరంలోకి చొరబడి కొంతమంది పౌరులను వైపీజీ తిరుగుబాటు దారులు బంధీలుగా మల్చుకున్నారని తెలిపింది. గౌటాలో అశాంతి యుత వాతావరణం సృష్టించేం దుకు తిరుగుబాటుదారులు కుట్ర పన్నారని పేర్కొన్నది. ఈ ప్రాంతంలో 30 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలని ఐరాస భద్రతా మండలి గతవారం నిర్ణయించింది. ఐరాస నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తిరుగుబాటుదారులు దాడులకు పాల్పడే ప్రమాదముందని మేజర్ జనరల్ యూరీ యెవ్తుషెంకో హెచ్చరించారు. సిరియాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే రసాయనిక దాడులు జరిగాయని యూరీ తెలిపారు. డమాస్కస్‌లో కాల్పుల విరమణ పాటించాలని ఐరాస తీర్మానించినప్పటికీ తిరుగుబాటుదారులు విధ్వంసాలకు పాల్పడుతున్నారని అన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







