శ్రీదేవి మృతిపై అభిమానుల్లో పెరుగుతున్న అసహనం

- February 26, 2018 , by Maagulf
శ్రీదేవి మృతిపై అభిమానుల్లో పెరుగుతున్న అసహనం

దుబాయ్:  శ్రీదేవి మృతిపై అనుక్షణం ఎంతో ఉత్కంఠ నెలకొంటోంది అటు మీడియా మరియు అభిమానులలో. సోమవారం తో ఈ మిస్టరీకి తెర పడుతుంది అనుకుంటున్న తరుణంలో మళ్ళీ ఊహించని విధంగా అధికారుల నుండి నిరాశే ఎదురయింది. ఆమె భౌతికకాయాన్ని సోమవారం ముంబై కి తరలిస్తారు అని అనుకుంటున్న సమయంలో ఇలా జాప్యం జరుగుతుండటంతో అభిమానులు ఎంతో నిరాశ చెందారు. పోలీస్ క్లియరెన్స్ అనంతరం లీగల్ క్లియరెన్స్ కు వెళ్లిన ఈ కేసు అక్కడ నిలిచిపోవటం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. కానీ, దుబాయ్ లో ఎటువంటి మరణం సంభవించినా ఒక క్రమపద్ధతిన ఆ కేసు ని విచారించి క్లియరెన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఇది సుమారు 4-5 రోజుల సమయం లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది (కేసు స్వభావాన్ని అనుసరించి). కాగా శ్రీదేవి విషయంలో భారత ఉన్నతాధికారులు సిఫారసు మీద ఈ కేసు ను అతి త్వరగా పూర్తి చేసేందుకు దుబాయ్ అధికారులు సహకరించటం విశేషం. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి ఖచ్చితమైన సమాధానం లభించిన తక్షణం ఆమె పార్ధివదేహాన్ని ఎంబామింగ్ కు తరలిస్తారు. మీడియా ను వేధిస్తున్న పలు ప్రశ్నలు:

1) శ్రీదేవి మరణించినప్పుడు ఆమె భర్త బోనీ కపూర్ ఆమెతోనే ఉన్నారా?
2) బోనీ కపూర్ ఎప్పుడు వచ్చారు, శ్రీదేవి ని విగత జీవిగా ఎప్పుడు చూసారు, ఎంత సమయంలో పోలీసులకు ఆయన వార్త అందించారు?
3) బాత్రూం టబ్ లో నీరు నిండుగా ఉన్నాయా?
4) బాత్రూం మొత్తం నీటి మడుగులా ఉందా?
5) ఆమె మద్యం సేవించిన మాట నిజమే అయితే ఆ బాటిల్స్ ఉన్నాయా గదిలో?
6) టబ్ లో పడి మరణించినప్పుడు శ్రీదేవి తలకి గాయమైందా?

ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు పోలీసు వారు సమాధానమివ్వాల్సి ఉంది. మొత్తానికి శ్రీదేవి పార్థివదేహం ఈ రోజైన ముంబై చేరుతుందా అనే ప్రశ్నకు ఇంకా అధికారుల నుండి స్పష్టత లేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com