అల్‌ ఫతే కోస్ట్‌లో మృతదేహం

- February 26, 2018 , by Maagulf
అల్‌ ఫతే కోస్ట్‌లో మృతదేహం

మనామా: జుఫైర్‌లోని అల్‌ పతె కోస్ట్‌లో ఓ బాలుడి మృతదేహం లభ్యమయ్యింది. రాత్రి 11 గంటల సమయంలో అల్‌ ఫతె కోస్ట్‌లో ఈ మృతదేహాన్ని గుర్తించారు. మృతుడి వయసు 20 ఏళ్ళుగా వుండొచ్చనీ, అరబ్‌ వ్యక్తి అవవచ్చుననీ అనుమానిస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ ఈ విషయాన్ని ధృవీకరించింది. సంబంధిత అధికార వర్గాలు, మృతదేహం లభ్యం కావడానికి సంబంధించి చట్ట పరమైన చర్యలు తీసుకుంటున్నాయనీ, కేసు నమోదు చేసి విచారణ జరుపుతారని మినిస్ట్రీ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com