శ్రీదేవి మృతి కేసు క్లోజ్‌.. ఇలా!

- February 27, 2018 , by Maagulf
శ్రీదేవి మృతి కేసు క్లోజ్‌.. ఇలా!

నాలుగు రోజులుగా సంచలనం సృష్టించిన మహానటి శ్రీదేవి మృతి కేసు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. బాత్‌టబ్‌లో మునగడం వల్లే  శ్రీదేవి ప్రాణాలు కోల్పోయిందని... దుబయి పోలీసులు నిర్ధరించారు. అటు ఈ వ్యవహారంలో మొదట్నుంచి కఠినంగా వ్యవహరించిన ప్రాసిక్యూషన్ సైతం... ఈ వ్యవహారంలో ఎలాంటి ఇతర అనుమానాలు లేవని తేల్చేసింది. ఈ కేసులో ఉన్న సందేహాలన్నీ నివృత్తి చేసుకున్నామని... స్థానిక చట్టాల ప్రకారమే ఈ కేసును పూర్తిస్థాయిలో విచారణ జరిపామని వెల్లడించింది. ఇకపై ఈ కేసులో ఎలాంటి విచారణ ఉండదని... కేసును క్లోజ్‌ చేస్తున్నామని దుబాయ్ ప్రాసిక్యూషన్‌ వెల్లడించింది. పూర్తిస్థాయి విచారణ తర్వాతే... మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు అధికారులు వెల్లడించారు.

శనివారం రాత్రి 10 గంటల సమయంలో దుబాయ్‌లోని జుమైరా ఎమిరేట్స్‌ టవర్స్‌ హోటల్‌ గదిలో  శ్రీదేవి కన్నుమూసింది. హార్ట్‌ స్ట్రోక్ వల్లే  శ్రీదేవి చనిపోయిందని మొదట అంతా అనుకున్నారు. అయితే ఫోరెన్సిక్‌ విచారణ ప్రారంభమైన తర్వాత.... సీన్‌ క్రమంగా మారిపోయింది. ఆమెకు అసలు హార్ట్‌ స్ట్రోక్‌ రానే లేదని... పోస్టు మార్టం నివేదికలో స్పష్టమైంది. ఎక్కువగా ఆల్కహాల్‌ సేవించిన శ్రీదేవి బాత్‌టబ్‌లో మునగడం వల్ల చనిపోయిందని తేల్చారు. అయితే ఎలాంటి అనారోగ్యం లేని  శ్రీదేవి... బాత్‌టబ్‌లో ఎలా పడిందనే దానిపై సందేహాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ వ్యవహారంపై ప్రాసిక్యూషన్‌ దృష్టిసారించింది. స్థానిక చట్టాల ప్రకారం విచారణ అంతా పూర్తయితే గానీ... క్లియరెన్స్‌ సర్టిఫెకెట్‌ ఇచ్చేది లేదని అధికారులు తేల్చిచెప్పారు. దీంతో మృతదేహం అప్పగింత తరలింపు ఆలస్యమైంది. 

నిన్నటి నుంచి ఈ వ్యహారంపై కూలకషంగా విచారణ జరిపిన ప్రాసిక్యూషన్ అధికారులు... ఎట్టకేలకు ఇందులో ఎలాంటి కుట్ర లేదని నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. స్థానిక చట్టాల ప్రకారం అన్ని కోణాల్లో విచారణ జరిపాకే... క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ ఇచ్చినట్లు అధికారులు.. తెలిపారు. అటు క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌, మృతదేహం అప్పగింత వ్యవహారాన్ని భారత దౌత్య కార్యాలయం కూడా ధృవీకరించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com