హిట్‌ అండ్‌ రన్‌ అనుమానితుడి పట్టివేత

- February 27, 2018 , by Maagulf
హిట్‌ అండ్‌ రన్‌ అనుమానితుడి పట్టివేత

మస్కట్‌: హిట్‌ అండ్‌ రన్‌ కేసులో ఓ అనుమానితుడ్ని పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. హిట్‌ అండ్‌ రన్‌ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన సంగతి తెలిసినదే. అల్‌ ఖుర్రమ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. రాయల్‌ ఒమన్‌ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఖుర్రమ్‌ ట్రాఫిక్‌ లైట్స్‌ ప్రాంతంలో ఓ వాహనం, ఓ వ్యక్తిని ఢీకొంది. ప్రమాదం జరిగిన తర్వాత ఆ వాహనం ఆగకుండా వెళ్ళిపోయింది. ఘటనలో గాయపడ్డ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా, అనుమానితుడ్ని విచారించగా, ఆ నేరానికి పాల్పడినట్లుగా ఒప్పుకున్నాడు. తదుపరి విచారణ నిమిత్తం సంబంధిత అధికారులకు ఈ కేసును అప్పగించడం జరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com