సిరియాలో కాల్పుల విరమణ ఉల్లంఘన
- February 27, 2018
సిరియాలో శాంతి స్థాపన కోసం ఐరాస ప్రయత్నిస్తోంది. ఈ మేరకు 30 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలని సిరియా బలగాలను, తిరుగుబాటుదారులను సూచించింది. ఇరు వర్గాల మధ్య జరుగుతున్న భీకర పోరులో దాదాపు 700 మందికి పైగా చనిపోవడంతో ఐరాస భద్రతా మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే, ఒకవేళ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆమోదించినట్టయితే తమ ఉనికి కోల్పోతామనే ఫోబియాతో తిరుగుబాటుదారులు గౌటా నగరంపై బాంబుల వర్షం కురిపిస్తున్నారు. ఎందరో అమాయక ప్రజలను పొట్టనబెట్టుకుంటున్నారు. ఐరాస భద్రతా మండలి ఆదేశాలను బేఖాతర్ చేస్తున్నారు. ఇప్పటికే తిరుగుబాటుదారులు జరిపిన వైమానిక దాడుల్లో ఆస్పత్రులు, భవనాలు, వందలకొద్ది ఇండ్లు ధ్వంసమయ్యాయి. గౌటాలో నెత్తురు ఏరులై పారుతోంది. గౌటాలో కొనసాగుతున్న నరమేధాన్ని ఆపాలనే లక్ష్యంతో ఈనెల 25న ఐరాస భద్రతా మండలి సమావేశం జరిగింది. తక్షణమే సిరియాలో కాల్పుల విరమణ ఒప్పందం అమలు చేయాలని మండలి తీర్మానం చేసింది. ఈ తీర్మానానికి సిరియా మిత్రదేశమైన రష్యా కూడా ఓటేసింది. సిరియా రాజధాని డమాస్కస్ శివారు నగరమైన గౌటా నగరం 2013 నుంచి తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉంది. ఈ నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సిరియా బలగాలు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!







