భూమికి చేరిన నాసా వ్యోమగాములు
- February 27, 2018
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లో పనిచేసిన ముగ్గరు వ్యోమగాములు తిరిగి భూమిపైకి సురక్షితంగా చేరుకున్నారు. అమెరికాకు చెందిన ఇద్దరు, రష్యాకు చెందిన ఓ వ్యోమగామి ఈరోజు ఉదయం కజకిస్థాన్‌లో ల్యాండ్ అయ్యారు. రష్యాకు చెందిన అలెగ్జాండర్ మిసర్కిన్, అమెరికాలోని నాసా వ్యోమగాములు మార్క్ వాండే, జోయ్ అకాబా అయిదు నెలల పాటు ఐఎస్‌ఎస్‌లో పనిచేసి కిందకు వచ్చారు. ముగ్గురు వ్యోమగాములు భూమిపైకి ల్యాండ్ అయ్యే ఆపరేషన్ ప్రణాళిక ప్రకారం పూర్తయిందని, ముగ్గురు సురక్షితంగా ఉన్నారని రష్యా స్పేస్ ఏజెన్సీ వెల్లడించింది. 40ఏళ్ల మిసర్కిన్ నిన్న ఐఎస్‌ఎస్ కమాండ్ పదవిని ఆంటోన్ షకప్లెరోవ్‌కు అప్పగించారు. మిస్కరిన్ రెండు మిషన్లలో 334 రోజులు అంతరిక్షంలో ఉన్నారు. 50ఏళ్ల జోయ్ అకాబా మూడు మిషన్లలో కలిపి పది నెలలు అంతరిక్షంలో ఉన్నారు. మరో వ్యోమగామి మార్క్ వాండే తొలిసారి అంతరిక్షంలో ఉండి వచ్చారు.
తాజా వార్తలు
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!







