సిరియాలో కాల్పుల విరమణ ఉల్లంఘన

- February 27, 2018 , by Maagulf
సిరియాలో కాల్పుల విరమణ ఉల్లంఘన

సిరియాలో శాంతి స్థాపన కోసం ఐరాస ప్రయత్నిస్తోంది. ఈ మేరకు 30 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలని సిరియా బలగాలను, తిరుగుబాటుదారులను సూచించింది. ఇరు వర్గాల మధ్య జరుగుతున్న భీకర పోరులో దాదాపు 700 మందికి పైగా చనిపోవడంతో ఐరాస భద్రతా మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే, ఒకవేళ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆమోదించినట్టయితే తమ ఉనికి కోల్పోతామనే ఫోబియాతో తిరుగుబాటుదారులు గౌటా నగరంపై బాంబుల వర్షం కురిపిస్తున్నారు. ఎందరో అమాయక ప్రజలను పొట్టనబెట్టుకుంటున్నారు. ఐరాస భద్రతా మండలి ఆదేశాలను బేఖాతర్‌ చేస్తున్నారు. ఇప్పటికే తిరుగుబాటుదారులు జరిపిన వైమానిక దాడుల్లో ఆస్పత్రులు, భవనాలు, వందలకొద్ది ఇండ్లు ధ్వంసమయ్యాయి. గౌటాలో నెత్తురు ఏరులై పారుతోంది. గౌటాలో కొనసాగుతున్న నరమేధాన్ని ఆపాలనే లక్ష్యంతో ఈనెల 25న ఐరాస భద్రతా మండలి సమావేశం జరిగింది. తక్షణమే సిరియాలో కాల్పుల విరమణ ఒప్పందం అమలు చేయాలని మండలి తీర్మానం చేసింది. ఈ తీర్మానానికి సిరియా మిత్రదేశమైన రష్యా కూడా ఓటేసింది. సిరియా రాజధాని డమాస్కస్‌ శివారు నగరమైన గౌటా నగరం 2013 నుంచి తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉంది. ఈ నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సిరియా బలగాలు ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com