ఇన్‌ఫెస్టెడ్‌ పామ్‌ ట్రీస్‌ తరలింపుకి బ్రేక్‌

- February 28, 2018 , by Maagulf
ఇన్‌ఫెస్టెడ్‌ పామ్‌ ట్రీస్‌ తరలింపుకి బ్రేక్‌

మస్కట్‌: ఒమనీ స్కూల్‌ స్టూడెంట్‌ ఒకరు ఇచ్చిన సమాచారంతో మినిస్ట్రీ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫిషరీస్‌ అధికారులు షామ్‌ రపాంతంలో ఇన్‌ఫెస్టెడ్‌ పామ్‌ ట్రీస్‌ని తీసుకెళుతున్న ట్రక్‌ని అడ్డగించారు. అగ్రికల్చరల్‌ విలేజెస్‌ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ఇన్‌ఫెస్టెడ్‌ పామ్‌ ట్రీస్‌ని నిందితులు తరలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ చెట్లను తరలిస్తున్న వాహనాన్ని అధికారులు సీజ్‌ చేశారు. ఈ ఏడాది జనవరిలో మినిస్ట్రీ ఆఫ్‌ అగ్రిక్లచర్‌ అండ్‌ ఫిషరీస్‌ 21 క్వారంటీన్డ్‌ ఎగ్రికల్చర్‌ ఏరియాస్‌ని సుల్తానేట్‌లో గుర్తించింది. ఆరోగ్యకరమైన ప్రాంతాలకు వీటిని తరలించకుండా వుండేందుకు నిషేధాజ్ఞలు కూడా విధించడం జరిగింది. ఈ నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించేవారికి మూడు నెలల వరకు జైలు శిక్ష, 2000 ఒమన్‌ రియాల్స్‌ జరీమానా విధించబడుతుంది. పదే పదే నిషేధాజ్ఞల్ని ఉల్లంఘిస్తే జరీమానా, జైలు శిక్ష రెట్టింపవుతుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com