4800 హౌసింగ్ యూనిట్స్‌కి 'డ్రా'
- February 28, 2018
మనామా: క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీం కమాండర్, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా ఆదేశాల మేరకు, కింగ్డమ్లో 4,800 మంది లబ్దిదారులకు హౌసింగ్ యూనిట్స్‌ని పంపిణీ చేయనున్నట్లు హౌసింగ్ మినిస్ట్రీ ప్రకటించింది. ఎలక్ట్రానిక్ డ్రా ద్వారా నార్తరన్ సిటీ ఐలాండ్స్ 13, 14కి సంబంధించి హౌసింగ్ యూనిట్స్ ఎంపిక జరుగుతోంది. జిసిసి డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా మినిస్ట్రీ హౌసింగ్ యూనిట్స్‌ని నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టుల విషయంలో సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తోన్న వివిధ శాఖల్ని హౌసింగ్ మినిస్ట్రీ ఈ సందర్భంగా అభినందించింది. 25,000 హౌసింగ్ యూనిట్స్‌లో నార్తరన్ సిటీ బిగ్గెస్ట్ స్ట్రాటజిక్ ప్రాజెక్ట్‌గా అభివర్ణించబడుతోంది. నార్తరన్ సిటీలో న్యూ హౌసింగ్ యూనిట్స్ అన్ని రకాల సౌకర్యాలతో ఏర్పాటవుతున్నట్లు హౌసింగ్ మినిస్ట్రీ పేర్కొంది. పబ్లిక్ బీచ్‌లు, పెడెస్ట్రియన్ క్రాసింగ్స్, బైసికిల్ లేన్స్, బస్ స్టాప్స్, పవర్ స్టేషన్స్, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ వంటి ఆకర్షణలు ఈ ప్రాజెక్ట్‌లో ఉన్నాయి.
తాజా వార్తలు
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్‌లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్‌లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్‌తో భేటీ అయిన నెతన్యాహు..







