క్రైస్తవులు, ముస్లింలకు మధ్య ఘర్షణ,13 మంది మృతి
- February 28, 2018
సెంట్రల్ నైజీరియాలో క్రైస్తవులు, ముస్లిం యువకుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో చాలా వరకు ఇండ్లు, షాపులు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. కదునా స్టేట్ రాజధాని కదునా పట్టణంలో ఈ ఘర్షణలు నెలకొన్నాయి. ఘర్షణకు కారణమైన 20 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్‌కమిషనర్ ఆస్టిన్ ఐవర్ తెలిపారు. భద్రతా దళాలు ఉద్రిక్త వాతావరణ పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చాయిని, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని ఐవర్ వెల్లడించారు. కొందరు క్రైస్తవ అమ్మాయిలు, ముస్లిం యువకులతో సన్నిహితంగా ఉండటమే ఈ ఘర్షణకు కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ ఘటనపై అప్పుడే నిర్ధారణకు రాలేమని..పూర్తి దర్యాప్తు చేపడుతామని ఆస్టిన్ ఐవర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!