బల్దియా చరిత్రలో నూతన అధ్యాయం
- February 28, 2018
GHMC 2018-19 ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌కు కౌన్సిల్ ఆమోదముద్ర వేసింది. బల్దియా చరిత్రలోనే అత్యధికంగా 13వేల 150 కోట్ల మెగా బడ్జెట్‌ను ఓకే చేసింది కార్పొరేషన్. మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు చర్చించి.. బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వార్షిక బడ్జెట్ అంచనాలపై కౌన్సిల్ సుదీర్ఘంగా చర్చించింది. 2018-19 బడ్జెట్‌కు సంబంధించి 13వేల 150 కోట్ల రూపాయలతో అంచనాలను రూపొందించి ఆమోదించింది. అందులో జమాఖర్చులు 6వేల 76 కోట్లు కాగా, హౌసింగ్, మూసీ, రోడ్ల అభివృద్ధికి 7వేల 73 కోట్లు ఖర్చు చేయనుంది. 3వేల 325 కోట్ల రెవిన్యూ ఆదాయం కాగా, క్యాపిటల్ రిసిప్ట్ కింద మూడు కార్పొరేషన్ల నుంచి 7వేల 73 కోట్లుగా నిర్ధారించారు. రెవిన్యూ వ్యయం 2వేల 675 కోట్లుగానూ, క్యాపిటల్ వ్యయం 3వేల 401 కోట్లుగా నిర్ణయించారు.
GHMC బడ్జెట్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం హౌసింగ్ కార్పొరేషన్‌కు 6వేల 317 కోట్లు కేటాయించారు. హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు 377 కోట్లు, మూసీ సుందరీకరణకు 377 కోట్లు కేటాయించారు. మొత్తం మూడు కార్పొరేషన్ల ద్వారా 7వేల 73 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్ల రూపంలో అందించనుంది. ఇక రెవిన్యూ రిసిప్ట్‌ల్లో పన్నుల ద్వారా 17వందల 25 కోట్లు లభించనుండగా, ఫీజులు, యూజర్ చార్జీల రూపంలో వెయ్యి 33 కోట్లు సేకరిస్తారు.
బడ్జెట్ నిధుల వినియోగంలో లోపాలున్నాయని ఎక్స్ అఫీషియో సభ్యుడు, ఎంఐఎం ఎమ్మెల్సీ జాఫ్రీ ప్రస్తావించారు. ఏటా నిధుల వ్యయం 3వేల కోట్లకు మించడం లేదని, అంచనాలు మాత్రం ఏటేటా పెరుగుతున్నాయన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకోవడం లేదన్నారు.
బడ్జెట్‌పై చర్చ తర్వాత మేయర్ బొంతు రామ్మోహన్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. కార్పొరేటర్లకు జీతాలు పెంచాలని, కార్పొరేటర్ ఫండ్ ఇవ్వాలని కొందరు డిమాండ్ చేయగా.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని మేయర్ తెలిపారు. అయితే, జీహెచ్‌ఎంసీ వేల కోట్ల బడ్జెట్ పెడుతున్నా.. అభివృద్ధి మాత్రం కనిపించడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బడ్జెట్ అంతా బడాయి కోసమే అన్నట్టుందనే అభిప్రాయం ప్రజల్లో కనిపిస్తోంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..