మారణహోమం: పసిపిల్లలపై గన్ గురిపెట్టి..మహిళలను హింసించి..

- February 28, 2018 , by Maagulf
మారణహోమం: పసిపిల్లలపై గన్ గురిపెట్టి..మహిళలను హింసించి..

అభం శుభం తెలియని పసిపిల్లల్ని తుపాకులతో గురిపెట్టి మరీ చంపుతున్నారు సిరియాలోని గౌట ఉగ్రవాదులు. సిరియాలోని గౌట ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకుని మారణహోమం సృష్టిస్తున్నారు. టర్కీ, రష్యా, ఇరాన్ మొదలైన దేశాలు తూర్పు గౌటను ప్రత్యేకంగా గుర్తించాలని ఆ ప్రాంతం మీదుగా సిరియా, రష్యన్ యుద్ధ విమానాలను అనుమతించకూడదని ఉగ్రవాదులు ఆంక్షలు విధించారు. దీంతో సిరియా ప్రభుత్వం వారిని ఎలాగైనా తుదుముట్టించాలనే పథకం వేశారు. ఈ క్రమంలో ఉగ్రవాదులున్న గౌట ప్రాంతాన్ని ప్రభుత్వ  ఆధీనంలోకి తెచ్చుకోవాలని వారిపై బాంబులు, రసాయనిక ఆయుధాలను సైతం వినియోగిస్తున్నారు. ఆ రసాయనిక ఆయుధాల ప్రభావం చిన్నపిల్లలకు ప్రాణసంకటంగా మారాయి. రసాయనాలా ప్రభావంతో ఊపిరాడక వందలమంది చిన్నపిల్లలు చనిపోయారు. అయితే ప్రభుత్వ దాడులకు ప్రతిదాడులుగా గౌట ఉగ్రవాదులు చిన్నపిల్లల్ల్ని ఎత్తుకెళ్ళి కాల్చి చంపుతున్నారు. అలాగే కొందరు మహిళలను హింసించి హత్యాచారాలకు పాల్పడుతున్నారు.ఇరువురి దాడులు ప్రతిదాడుల్లో దాదాపు 700 మంది అమాయక ప్రజలు మరణించారు. అందులో పసిపిల్లలు 200 కు పైగానే ఉండగా మహిళలు కూడా ఎక్కువమందే చనిపోయారని మానవహక్కుల సంఘాలు దృవీకరిస్తున్నాయి. ప్రజలు ఏమౌతారో  అన్న విషయం మరచి ఉగ్రవాదుల పేరుతో అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్నారని ప్రపంచదేశాలు సిరియా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇదిలావుండగా అమెరికా, రష్యా దేశాలు కొన్ని రోజులపాటు యుద్ధ విరమణ చేయాలనీ, దాడులు జరపవద్దని సిరియాకు ఆంక్షలు విధించాయి. ఇద్దరి చర్యల వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయని అందుకు ౩౦రోజులపాటు యుద్ధం ఆపేసి చర్చల దిశగా అడుగులు వెయ్యాలని సూచించాయి.. ఈ సూచనలను ఏమాత్రం బేఖాతరు చేయని సిరియా ప్రభుత్వం దాడులు  కొనసాగిస్తోనే ఉంది. ఈ క్రమంలో పరిస్థితి చేయిదాటి పోవడంతో  చేసేది లేక యుద్దాన్ని ఐదుగంటలపాటు నిలిపివేయాలని రష్యా  సిరియాను కోరింది. లేనిచో యుద్ధంలో తమ దళాల సహాయం ఉండదని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా యుద్దాన్ని నిలిపివేసింది సిరియా ప్రభుత్వం. దీంతో బతుకు జీవుడా అంటూ గౌటాలోని 25 శాతం ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఇక్కడ చిత్రమేమిటంటే రష్యా దళాల సహకారంతో సిరియా ప్రభుత్వం గౌట ఉగ్రవాదులపై దాడులు ప్రారంభించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com