వచ్చే మూడేళ్లలో ఎటువంటి ఫీజుల భారాన్ని మోపం అని ప్రకటించిన యూఏఈ ప్రధాన మంత్రి

- March 01, 2018 , by Maagulf
వచ్చే మూడేళ్లలో ఎటువంటి ఫీజుల  భారాన్ని మోపం అని ప్రకటించిన యూఏఈ ప్రధాన మంత్రి

అబుదాబి: రానున్న మూడేళ్లలో యూఏఈ ఫెడరల్ ఫీజుల్లో ఎలాంటి పెరుగుదల ఉండబోదని  యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి, దుబాయ్ కింగ్  షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూం భరోసా ఇచ్చారు.  విదేశీ పెట్టుబడులను మరింత ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఆర్థికాభివృద్ధి, సామాజిక స్థిరత్వం, పారిశ్రామిక, వాణిజ్య రంగాలను అభివృద్ధి చేయాలని, ఆ చర్యలతో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆరోగ్యం, రవాణా, భవిష్యత్తు ఉపకరణాలు, నీరు, వాతావరణం, అంతరిక్ష సాంకేతికాభివృద్ధి వంటి రంగాల అభివృద్ధికి తొలుత ప్రాధాన్యత ఇస్తామని, కేబినెట్ సమావేశంలో ఈ తీర్మానాన్ని ఆమోదించానని షేక్ మొహమ్మద్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com