మస్కట్‌లో మెయిన్‌రోడ్‌ 'క్లోజర్‌' వార్నింగ్‌

- March 01, 2018 , by Maagulf
మస్కట్‌లో మెయిన్‌రోడ్‌ 'క్లోజర్‌' వార్నింగ్‌

మస్కట్‌: క్యాపిటల్‌లో మునిసిపల్‌ అథారిటీస్‌, సుల్తాన్‌ కబూస్‌ స్ట్రీట్‌ (సీబ్‌ వైపు వెళ్ళే మార్గం) నేటి నుంచి మూసివేయబడ్తుందని ప్రకటించింది. పీరియాడిక్‌ మెయిన్‌టెనెన్స్‌లో భాగంగా ఈ పనులు ప్రారంభమయ్యాయి. మస్కట్‌ మునిసిపాలిటీ, రాయల్‌ ఒమన్‌ పోలీస్‌తో కలిసి సంయుక్తంగా ఈ మూసివేతను చేపట్టాయి. అల్‌ ఖువైర్‌కి ముందున్న ట్రాఫిక్‌ లైట్స్‌ నుంచి సుల్తాన్‌ కబూస్‌ స్ట్రీట్‌పై రెండు లేన్లను మూసివేస్తారు. ఈ వీకెండ్‌ అంతా ఈ మూసివేత అమల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో వాహనదారులు ట్రాఫిక్‌ గైడ్‌ లైన్స్‌ని అనుసరించి తమ వాహనాల్ని నడపాల్సి ఉంటుందని అధికారులు సూచించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com