కార్నిష్ అల్‌ కువాసిమ్‌లో స్పీడ్‌ లిమిట్‌ తగ్గింపు

- March 01, 2018 , by Maagulf
కార్నిష్ అల్‌ కువాసిమ్‌లో స్పీడ్‌ లిమిట్‌ తగ్గింపు

రస్‌ అల్‌ ఖైమా పోలీస్‌ - ట్రాఫిక్‌ అండ్‌ పెట్రోల్స్‌ డిపార్ట్‌మెంట్‌ వెల్లడించిన వివరాల ప్రకారం కార్నిష్ అల్‌ కువాసిమ్‌ రోడ్డుపై వేగం గంటకు 60 కిలోమీటర్ల నుంచి గంటకు 50 కిలోమీటర్లకు తగ్గించారు. రాడార్‌ ఫ్లాష్‌ని మాత్రం గంటకు 71 కిలోమీటర్లుగా నిర్నయించారు. గంటకు 20 కిలోమీటర్ల స్పీడ్‌ బఫర్‌ని ఓవర్‌ స్పీడ్‌ లిమిట్స్‌ కోసం నిర్ణయించారు. రస్‌ అల్‌ ఖైమా పోలీస్‌ - ట్రాఫిక్‌ అండ్‌ పెట్రోల్స్‌ డిపార్ట్‌మెంట్‌ యాక్టింగ్‌ డైరెక్టర్‌ కల్నల్‌ అహ్మద్‌ సయీద్‌ అల్‌ సామ్‌ అల్‌ నక్బి మాట్లాడుతూ, అతి వేగంగా వాహనాల్ని నడిపేవారిని అదుపు చేసేందుకోసం తాజా నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని అన్నారు. సోఫిస్టికేటెడ్‌ మొబైల్‌ స్నిపర్‌ రాడార్‌ ద్వారా రోడ్డుపై వెళ్ళేవారిని భయభ్రాంతులకు గురిచేసే వాహనదారుల్ని గుర్తించనున్నారు. ఇదిలా ఉంటే, రోడ్ల కండిషన్‌ని దృష్టిలో పెట్టుకుని వాహనాల బ్యాన్‌పై తాత్కాలిక ఎత్తివేతను కూడా అమలు చేస్తున్నారు. గతంలో ఉదయం 6 గంటల నుంచి 8.30 నిమిషాల వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు బ్యాన్‌ ఉండగా, ఇప్పుడు ఆ బ్యాన్‌ని ఎత్తివేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com