సౌదీ అరేబియా లో సినిమాల కోసం నియమ నిబంధనలు ఆమోదం
- March 01, 2018
రియాద్: సౌదీ అరేబియాలో సినిమాలకి లైసెన్స్ పొందడంలో నిబంధనలను ది కమిషన్ ఫర్ ఆడియో-విజువల్ మీడియా ఆమోదించింది. రియాద్ లో గురువారం జరిగిన సమావేశంలో సంస్కృతి సమాచార మంత్రి ,కమిషన్ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ డాక్టర్ అల్-అలాద్ బిన్ సాలేహ్ అల్-అలాద్ అధ్యక్షత వహించి ఆమోదించారు ఈ నియమాలలో సినిమా హాల్ ఏర్పాటు, ఆపరేటింగ్ సినిమాలను ప్రదర్శించేందుకు లైసెన్స్, రెండు రకాల సంచార, స్థిర సినిమాల నిర్వహణ కోసం వంటిమూడు రకాల లైసెన్సులను గూర్చి పేర్కొన్నారు. లైసెన్సింగ్ నిబంధనల యొక్క కమిషన్ ఆమోదం అంతర్గత, ఆర్థిక, పురపాలక మరియు గ్రామీణ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు వంటి వివిధ సంబంధిత ప్రభుత్వ అధికారులతో, కమిషన్లతో సమన్వయ సహకారంతో అన్ని షరతులు మరియు పరిశీలనలు అనుగుణంగా వ్యవహరించాలని సౌదీ ప్రెస్ ఏజెన్సీ తెలిపింది. సివిల్ డిఫెన్స్, సౌదీ కస్టమ్స్, సౌదీ అరేబియా స్టాండర్డ్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఆర్గనైజేషన్. అల్-అల్లాద్ మాట్లాడుతూ, సినిమాల ద్వారా సంస్కృతి సృజనాత్మకతను సుసంపన్నం చేసుకోవటానికి ఈ రంగం ముఖ్య భూమిక పోషిస్తుందని అన్నారు. సినిమాల ద్వారా సేవలు , వినోద రంగంకు ఒక ప్రోత్సాహంగా మారి ఆర్థిక వైవిధ్యం సాధించడానికి దోహదం చేస్తుంది. అలాగే 30 లక్షలమందితో ముడిపడి భారీ స్థానిక మార్కెట్ కోసం అద్భుతమైన మార్గం తెరిచి ఉంటుంది. అలాగే ఈ విభాగం ద్వారా పలువురు పౌరులకు కొత్త ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది. సౌదీ రాజ్యంలో వినోద ఎంపికలను వృద్ధి చేస్తుందని అల్-ఆశాద్ ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!