నేటి నుంచి దక్షిణాది రాష్ట్రాలలో సినిమా థియేటర్స్ బంద్

- March 01, 2018 , by Maagulf
నేటి నుంచి దక్షిణాది  రాష్ట్రాలలో సినిమా థియేటర్స్ బంద్

డిజిటల్‌ ప్రొవైడర్స్‌ ఛార్జీలకు వ్యతిరేకంగా నేటి నుంచి దక్షిణాది రాష్ర్టాలలో థియటర్స్ బంద్ పాటిస్తున్నారు.. సినీ పరిశ్రమలోని నిర్మాతలు, ఎగ్జిబిటర్స్‌, పంపిణీదారులు బంద్‌కు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ, ఎపి, తమిళనాడు, కర్నాటక, కేరళలోని డిజిటల్ థియేటర్స్ లో ప్రదర్శనలను నిలిపివేశారు.. ప్రొవైడర్స్ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ గతవారం సినిమా డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు క్యూబ్‌, యూఎఫ్‌ఓ సంస్థలకు, నిర్మాత సంఘాలకు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఈ నెల రెండో తేది నుంచి చి సినిమాలను ఆ సర్వీస్‌లకు ఇవ్వకూడదని నిర్మాతల జాక్ నిర్ణయం తీసుకుంది. తెలుగురాష్ట్రాల్లో సుమారు 2400పైగా ధియేటర్లు ఉన్నాయి. వాటిల్లో డిజిటల్ తో నడిచే 2వేల ధియేటర్లు బంద్ తో మూతపడ్డాయి..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com