బహ్రెయిన్‌లో మాక్‌ ఫైర్‌ డ్రిల్‌

- March 02, 2018 , by Maagulf
బహ్రెయిన్‌లో మాక్‌ ఫైర్‌ డ్రిల్‌

మనామా: సివిల్‌ డిఫెన్స్‌ సర్వీస్‌మెన్‌, జుఫైర్‌లో ఫైర్‌ మాక్‌ డ్రిల్‌ని నిర్వహించారు. ఫైర్‌ ఫైటర్స్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హోటల్‌ అగ్ని ప్రమాదానికి గురైతే ఎలా స్పందిస్తారో ఈ మాక్‌ డ్రిల్‌లో చూపించారు. సివిల్‌ డిఫెన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. బిల్డింగ్‌ సేఫ్టీ సిస్టమ్స్‌ పట్ల అవగాహన కల్పించడం, అలాగే సివిల్‌ డిఫెన్స్‌ తాలూకు రెస్పాన్స్‌ మరియు రెడీనెస్‌ని పరీక్షించడం ఈ మాక్‌ ఫైర్‌ డ్రిల్‌ ఉద్దేశ్యం. దేశవ్యాప్తంగా ఈ తరహా మాక్‌ డ్రిల్స్‌ని మరిన్ని చేపట్టబోతున్నారు. అత్యవసర సమయాల్లో ఎలా స్పందించి, ప్రాణాల్ని కాపాడుకోగలమో ఈ మాక్‌ ఫైర్‌ డ్రిల్‌ ద్వారా తెలియజేస్తారు. ప్రజల్లోనూ ఇటువంటి ప్రమాదాల పట్ల అవగాహన కల్పించడం మాక్‌ డ్రిల్‌ ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com