దుబాయ్:కార్ క్లీనర్‌పై లైంగిక దాడి యత్నం
- March 02, 2018
దుబాయ్:33 ఏళ్ళ వ్యక్తి, 19 ఏళ్ళ కార్ క్లీనర్‌పై లైంగిక దాడి యత్నం చేసిన కేసులో విచారణ జరుగుతోంది. బాధితుడు తనకు జరిగిన అన్యాయంపై పోలీసులను ఆశ్రయించడంతో, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. 2017 డిసెంబర్ 30న అల్ రషిదియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఇంటర్నేషనల్ సిటీ, గ్రీన్ క్లస్టర్‌లో పనిచేస్తుండగా, ఓ వ్యక్తి తన కారుని తీసుకొచ్చాడనీ, కార్ క్లీన్ చేసేందుకు సిద్ధమవుతున్న తనను కారులోకి బలవంతంగా తోసి, తనపై లైంగిక దాడికి యత్నించాడని బాధితుడు పేర్కొన్నాడు. అయితే కారు క్లీన్ చేయడానికి మాత్రమే తాను డబ్బు చెల్లించాననీ, లైంగిక దాడి ఆరోపణల్లో వాస్తవం లేదని నిందితుడు చెబుతున్నాడు. ఈ ఘటనలో నిందితుడి కారుని స్వాధీనం చేసుకుని, ఎవిడెన్స్ నిమిత్తం ల్యాబ్‌కి తరలించారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఎవిడెన్స్ వెల్లడించిన నివేదిక ప్రకారం బాధితుడి శరీరంపై నిందితుడి డిఎన్‌ఏ ట్రేసెస్ లభించాయి. అత్యంత చాకచక్యంగా నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







