ప్రముఖ రచయిత, సినీ సమీక్షకుడు దేవరాజు రవి కన్నుమూత
- March 02, 2018
ప్రముఖ కథకుడు, నవలాకారుడు, సినీ సమీక్షకుడు దేవరాజు రవి(79) కన్నుమూశారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు హైదరాబాద్ మేడిపల్లిలోని నివాసంలో కన్ను మూశారు. దేవరాజు రవి 12 నవలలు, 200 పైగా కథలు, 1250 సినిమా సమీక్షలు ఇంకా పలు ఇతర వ్యాసాలూ రాశారు. తెలుగులో తొలి డిటెక్టివ్ నవల 'వాడే వీడు' రచయిత అయిన దేవరాజు వెంకట కృష్ణారావు కుమారుడైన రవి.. 1959లో రామం అనే నవలను రచించారు. అప్పటి నుంచి ప్రారంభమైన ఆయన రచనా వ్యాసంగం చివరిరోజు వరకు కొనసాగింది. దేవరాజు రవి మూడు కవితా సంపుటాలు, రెండు కథా సంపుటాలు వెలువరించారు. సితార, శివరంజని, మేఘసందేశం, నంబర్ వన్ సినిమా పత్రికలలో ఆయన చేసిన సమీక్షలు సినీ వర్గాల ప్రశంసల్ని పొందాయి.
దేవరాజు రచనలను సర్వేపల్లి రాధాకృష్ణన్, వి.వి. గిరి వంటి ప్రముఖులు మెచ్చుకున్నారు. నంది అవార్డుల కమిటీలో దేవరాజు రెండుసార్లు సభ్యుడిగా ఉన్నారు. రవి స్వస్థలం బరంపురం. దేవరాజు రవి సుప్రసిద్ధ సాంఘిక కార్యకర్త. కుష్టువ్యాధి నిర్మూలనకు విశేషంగా కృషిచేశారు. ఎంతోమంది రోగులకు స్వయంగా సేవ చేశారు. లెప్రసీ డాక్టర్‌గా ఏరికోరి ఉద్యోగం చేసి, పదవి విరమణ అనంతరం కూడా ఆ సేవల్ని కొనసాగించారు. దేవరాజు రవి అంత్యక్రియలు శనివారం హైదరాబాద్‌లో జరగనున్నాయి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి