బ్రిటన్‌లో వ్యాపార దిగ్గజాల పతనం
- March 02, 2018రోథర్‌హామ్ (బ్రిటన్) : బ్రిటన్‌లో ప్రసిద్ధి చెందిన వ్యాపార దిగ్గజ సంస్థలు టాయ్స్ ఆర్ అస్ , మాప్లిన్‌లు మూత పడ్డాయి. ఈ సంస్థలు తమ వ్యాపారాన్ని మూసివేస్తున్నట్లు గురువారం ప్రకటించటంతో దాదాపు 6 వేల మందికి పైగా ఉద్యోగులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఎలక్ట్రానిక్ వ్యాపార దిగ్గజ సంస్థ మాప్లిన్ మూతపడటంతో 2,300 మంది, టార్సు ఆర్‌యు సంస్థ మూతపడటంతో 3,200 మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. కాగా వీరి ఉద్యోగ భద్రతపై చర్చించేందుకు మూతపడిన కంపెనీ యాజమాన్యాలు, కార్మిక సంఘాలు, ప్రభుత్వం మధ్య త్రైపాక్షిక భేటీ జరగాలని లేబర్ పార్టీకి చెందిన షాడో వాణిజ్య మంత్రి రెబెక్కా లాంగ్‌బెయిలీ అభిప్రాయపడ్డారు.
జిఎంబి కార్మిక సంఘ ప్రధాన కార్యదర్శి టిమ్ రోచ్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం వద్ద సరైన పారిశ్రామిక వ్యూహం కానీ, ఉద్యోగ భద్రతకు సంబంధిం చిన ప్రణాళికలు కానీ లేకపోవటంతో ఉద్యోగులు, కార్మి కులు రోడ్డున పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో తమ వ్యాపారం తీవ్రస్థాయిలో మందగిం చినందు వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో వ్యాపారాన్ని మూసివేయాలని నిర్ణయించామని టార్సు ఆర్‌యుస్ సంస్థ యాజమాన్యం వెల్లడించింది. దాదాపు 1.5 కోట్ల పౌండ్ల పన్ను బకాయిలు, ఇతర రుణాలతో సతమవుతున్న ఈ సంస్థ తన వ్యాపారాన్ని గత ఏడాది పునర్వ్యవస్థీకరించి నష్టదాయక విభాగాలను మూసివేసింది. ఈ పునర్వ్యవస్థీ కరణ ప్రణాళికను గత డిసెంబర్‌లో పెన్షన్ ప్రొటెక్షన్ ఫండ్ (పిపిఎఫ్)తో సహా అధికశాతం మంది రుణదాతలు ఆమోదించినప్పటికీ, అంతిమంగా వ్యాపారాన్ని కాపాడు కోలేకపోయారు. టార్సు ఆర్‌యుస్ సంస్థ మూతపడిన కొద్దిగంటల్లోనే తాము కూడా వ్యాపారాన్ని మూసివేస్తు న్నట్లు మాప్లిన్ సంస్థ యాజమాన్యం ప్రకటించింది.
తమ సంస్థను విక్రయించేందుకు ప్రైస్‌వాటర్‌హౌస్ కూపర్స్ (పిడబ్ల్యుసి)కు అప్పగించామని, వ్యాపారం మందగించిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యామ్నాయం లేక వ్యాపారాన్ని మూసివేయాలని నిర్ణయించామని మాప్లిన్ యజమాని గ్రాహమ్ హారిస్ చెప్పారు. ఈ రెండు సంస్థల మూసి వేతతో రోడ్డున పడిన కార్మికులు, ఉద్యోగులు తీవ్ర ఆందో ళనకు గురవుతున్నారని లాంగ్‌బెయిలీ చెప్పారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని వారికి రావల్సిన వేతన బకాయిలను పూర్తిగా ఇప్పించేందుకు ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. దీనితో పాటు దేశ వ్యాప్తంగా రిటైల్ వ్యాపార రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణం స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు. కన్జర్వేటివ్ పార్టీ ప్రభుత్వం అంతర్గత విభేదాలకు తెరదించి బ్రిటన్ కార్మికులకు, యువతకు మంచి ఉద్యోగాలు, గౌరవప్రదమైన వేతనాలతో కూడిన అవకాశాలు కల్పించేం దుకు అవసరమైన ప్రణాళికతో ముందుకు రావాలన్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ గాయకుడు వై.ఎస్.రామకృష్ణకు ఎన్టీఆర్ వంశీ గ్లోబల్ అవార్డు
- నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన వైసీపీ
- మహా కుంభమేళాలో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం
- మైదుకూరులో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- సింగపూర్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్
- గన్నవరం ఎయిర్ పోర్ట్ కు అమిత్ షా
- డేటా సెంటర్లకు రాజధానిగా హైదరాబాద్..
- దుబాయ్ హిందూ మందిరానికి అరుదైన గౌరవం
- ప్రపంచ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో యూఏఈ కీలకం..!!
- సౌదీలో 2.9 మిలియన్లకు పైగా క్యాప్గాన్ పిల్స్ సీజ్..!!