యూఏఈ వెదర్: మేఘాలు, ఉష్ణోగ్రతల్లో తగ్గుదల
- March 03, 2018
యూఏఈలో వాతావరణం మేఘావృతంగా మారింది. ఇదే వాతావరణం మరికొన్ని రోజులు కూడా కొనసాగే అవకాశం ఉంది. రాత్రి వేళల్లో హ్యుమిడిటీ బాగా పెరగనుంది. ఉదయం వేళల్లో పొగమంచు కోస్టల్ మరియు ఇంటర్నల్ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే అవకాశముంది. సముద్రం రఫ్‌గా ఉంటుందనీ, ఒమన్ మరియు అరేబియన్ గల్ఫ్‌లో ఇదే పరిస్థితులు మరికొన్ని రోజులు కొనసాగుతాయని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ పేర్కొంది. మంగళవారం వరకు ఇదే వాతావరణ పరిస్థితులంటాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గే అవకాశాలున్నాయి. బ్యాడ్ వెదర్ కారణంగా వాహనదారులు తమ వాహనాల్ని చాలా జాగ్రత్తగా నడపాల్సి ఉంటుంది. నార్త్ వెస్టర్న్ గాలులు 15 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. కొన్ని చోట్ల దుమ్ము ఎగసిపడి విజిబిలిటీ దెబ్బతినే అవకాశం కూడా ఉంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్‌తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







