కార్‌ డ్రిఫ్టింగ్‌: ఒమన్‌లో ఒకరి అరెస్ట్‌

- March 03, 2018 , by Maagulf
కార్‌ డ్రిఫ్టింగ్‌: ఒమన్‌లో ఒకరి అరెస్ట్‌

రోడ్డుపై కార్‌ డ్రిఫ్టింగ్‌ షో చేస్తున్నందుకుగాను ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేసినట్లు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ వర్గాలు వెల్లడించాయి. ఏ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందన్న విషయమ్మీద మాత్రం స్పష్టత ఇవ్వలేదు. పబ్లిక్‌ రోడ్డుపై ఓ వ్యక్తి డ్రిఫ్టింగ్‌కి పాల్పడ్డాడనీ, సోషల్‌ మీడియాలో ఈ విషయం వెలుగు చూసిందని జనరల్‌ ట్రాఫిక్‌ డిపార్ట్‌మెంట్‌ పేర్కొంది. ఈ తరహా ఘటనలకు పాల్పడినవారిపై కఠిన చ్యలు తీసుకోబడ్తాయి. వాహనదారులు ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాలనీ, రోడ్‌ డ్రిఫ్టింగ్‌ వంటి చర్యలతో ఇతరుల ప్రాణాలకు ముప్పు తీసుకురావద్దని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com