యూఏఈ కంపెనీలకు కొత్త ఎమిరేట్స్ ఐడి కార్డుల జారీ విధానం

- March 03, 2018 , by Maagulf
యూఏఈ కంపెనీలకు కొత్త ఎమిరేట్స్ ఐడి కార్డుల జారీ విధానం

దుబాయ్:తన ఉద్యోగుల కోసం ఎమిరేట్స్ గుర్తింపు కార్డులను (ఈఐడి) జారీ చేయడం  లేదా వాటిని పునరుద్ధరించాలని కోరుకునే సంస్థలకు ఎలక్ట్రానిక్ దరఖాస్తుల కొత్త వ్యవస్థను ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజెన్ షిప్ (ఎఫ్ఐఐ) శనివారం ప్రకటించింది. ఈ కొత్త వ్యవస్థ తో సంస్థలు గుర్తింపు కార్డులను జారీచేయడానికి ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజెన్ షిప్ సేవలను ఉపయోగించడానికి అధికారికంగా అనుమతిస్తుందని  ఒక  పత్రికా ప్రకటనలో తెలిపింది, 2018 లో ఈ కొత్త సేవ ద్వారా స్మార్ట్ , ఎలక్ట్రానిక్ సేవలు అధికారకంగా అన్ని సేవలను  80 శాతం మార్చడానికి లక్ష్యంతో ఉన్నట్లు పేర్కొంది. కట్టింగ్- ఎడ్జ్  అనే నూతన సాంకేతికతలను ఉపయోగించి ఖాతాదారులను  సంతోషముగా ఉంచేందుకు దోహదపడనుంది. ఈ కొత్త సేవ ద్వారా అన్ని సంస్థలకు ఎమిరేట్స్ ఐడెంటిటీ (ఈఐడి) కార్డులను రెస్యూల్ (పునరుద్ధరించుటకు) ఇది సహాయపడుతుంది. సమయం ఆదాచేయటం మరియు సంస్థలకు కార్డులను నేరుగా పంపిణీ చేయటానికి సంస్థలకు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజెన్ షిప్ (ఎఫ్ఐఐ) సులభతరం చేస్తుంది. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజెన్ షిప్ (ఎఫ్ఐఐ) సర్వీస్ సెంటర్స్ సపోర్ట్ డైరెక్టర్ అయిన నాసర్ అల్ అబ్యులౌలీ మాట్లాడుతూ కొత్త వ్యవస్థ ద్వారా  పునరుద్ధరణ రుసుము చెల్లించడంతోపాటు, తప్పులు చేసే అవకాశాలను తగ్గించి, కంపెనీలకు జారీ ప్రక్రియను వేగవంతం చేస్తుందన్నారు. నూతన సంస్థ యొక్క లాభాలను వివరించడానికి సంస్థల ప్రతినిధులకు ప్రత్యేకంగా సంస్థల మధ్య అవగాహన పెంపొందించడానికి  ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజెన్ షిప్ (ఎఫ్ఐఐ) అవగాహన కోసం ఒక ప్రచారం సైతం ప్రారంభించిందన్నారు.  ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజెన్ షిప్యొక్క నూతన వ్యవస్థను ఉపయోగించడానికి సంస్థల  ప్రతినిధుల కోసం ఒక ప్రత్యేక శిక్షణా కోర్సులు సైతం ఏర్పాటు చేయబడతాయని అల్ అబ్దుౌలీ పేర్కొన్నారు. కొత్త వ్యవస్థను పొందాలనుకునే సంస్థలకు   అనేక నిబంధనలను నెలకొల్పిందని వివరిస్తూ వివరించాడు. ఒక సంస్థ యొక్క ఉద్యోగుల సంఖ్య, లేదా అదే స్పాన్సర్ కు చెందిన కంపెనీల సమూహంలో100 మంది కన్నా తక్కువ ఉద్యోగులను కలిగి ఉండదు. సంస్థ బాధ్యత గల అధికారులచే లైసెన్స్ పొందాలి మరియు కొత్త సిస్టమ్ ఐ డ్  జారీ పొందడం కోసం  ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజెన్ షిప్ (ఎఫ్ఐఐ) కు దరఖాస్తు చేయాలి వ్యవస్థ, అవసరమైన పత్రాలు, అలాగే కాంటాక్ట్  మీద విధిగా ఒక సంతకం చేయాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com