కోజి వర్దరైచకరి

- March 03, 2018 , by Maagulf
కోజి వర్దరైచకరి

కావాల్సిన పదార్థాలు: చికెన్‌ - ఒక కిలో, కొబ్బరి తురుము - అర కప్పు, కరివేపాకు - ఒక రెబ్బ, మిరియాలు - ఐదు గ్రాములు, గరం మసాలా - ఒక టీ స్పూను, సోంపు - ఒక టీ స్పూను, కారం - రెండు టీ స్పూన్లు, పసుపు - ఒక టీ స్పూను, వెల్లుల్లి ముద్ద - ఒక టేబుల్‌ స్పూను, ధనియాల పొడి - ఒక టీ స్పూను, కొబ్బరినూనె - 100 గ్రాములు, పచ్చిమిరపకాయలు - ఆరు, ఉప్పు - తగినంత, కొత్తిమీర - ఒక కట్ట. 

తయారీ విధానం: చికెన్‌ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. గిన్నెలో కొబ్బరినూనె పోసి వేడెక్కాక కొద్దిగా కొబ్బరి తురుము, మిరియాలు, కరివేపాకు వేసి ఎర్రగా వేగించాలి. కారం, పసుపు, ధనియాల పొడి కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. బాగా చల్లారాక దీన్ని ముద్దగా రుబ్బుకోవాలి. ఇందులో గరంమసాలా, సోంపు, పచ్చిమిరపకాయ ముక్కలు, వెల్లుల్లి వేసి మళ్లీ వేగించాలి. చికెన్‌ వేసి ఎర్రగా వేగాక ఉప్పు, మిగిలిన కొబ్బరి తురుము వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. చివర్లో కొత్తిమీర తురుము వేసి దించేయాలి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com