చెట్టుకింద మాదకద్రవ్యాలను దాచిపెట్టిన అక్రమ రవాణాదారులు

- March 04, 2018 , by Maagulf
చెట్టుకింద మాదకద్రవ్యాలను దాచిపెట్టిన అక్రమ రవాణాదారులు

దుబాయ్: చిటారు కొమ్మన మిఠాయి పొట్లం మాదిరిగా ..కొందరు నిందితులు మాదక ద్రవ్యాలను ఓ చెట్టు  కింద ఎవరకి తెలియకుండా దాచిపెట్టారు. అయితే, వాటిని పాతాళంలో దాచిపెట్టినా గల్ఫ్ పోలీసులు వెలికి తీస్తారు. నిందితులను న్యాయస్థానంలో నుంచోబెడతారు. ఆ తర్వాత కఠినమైన శిక్షలు అమలుచేస్తారు. శనివారం మాదకద్రవ్య నిరోధక శాఖ విభాగ అధికారులు ఆసియా దేశాలకు చెందిన నలుగురు మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారులను పట్టుకున్నారు. దుబాయ్‌లోని ఓ ప్రాంతంలో భారీగా దాచిపెట్టిన డ్రగ్స్‌ను కనుగొన్నారు. 91.7 కేజీల కాప్టాగోన్ అనే మాధకద్రవ్యాల మాత్రల రూపంలో సర్దుకొని ఆ సంచులను ఓ చెట్టుకింద రహస్యంగా భద్రపరిచారు. వీరి అక్రమ చర్యలను రహస్యంగా గమనించిన  నిఘా అధికారులు ఏమాత్రం అనుమానం రాకుండా వ్యవహరించి ఇద్దరు నిందితులను అదుపులోనికి తీసుకొన్నారు.. చెట్టుకింద దాచిన డ్రగ్స్‌ను బయటకు తీస్తున్న సమయంలో అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో భాగంగా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు  మేజర్ జనరల్ ఖలీల్ ఇబ్రహిం అల్ మన్సూరి వెల్లడించారు. ఈ కేసుపై న్యాయస్థానం విచారణ జరపనుందని, నలుగురు నిందితులు జైలుశిక్ష తప్పదని ఆయన వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com