ఎయిర్‌ఏసియా వారి బంపర్ ఆఫర్

- March 04, 2018 , by Maagulf
ఎయిర్‌ఏసియా వారి బంపర్ ఆఫర్

ముంబయి: ఎయిర్‌ఏసియా విమానటికెట్లపై 90శాతం రాయితీని ప్రకటించింది. ఇతర సదుపాయాలతోపాటు మొత్తం బిగ్‌సేల్‌ స్కీం కింద 90శాతం వరకూ డిస్కౌంట్‌ప్రకటించింది. ఎయిర్‌ఏసియా కొత్త్పమోషనల్‌ అమ్మకాలకింద బిగ్‌సభ్యులకు మాత్రమే ఈ ఆఫర్‌ను అమలుచేస్తోంది. బిగ్‌లాయల్టీ మొబైల్‌యాప్‌ ద్వారా బుక్‌చేసుకునేవారికి ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. మార్చి 11వ తేదీ వరకూ అమలులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. అయితే సెప్టెంబరు 3వ తేదీనుంచి 2019 మే 28వ తేదీవరకూ మధ్యతేదీల్లో మాత్రమే ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. ఈ డిస్కౌంట్‌అన్ని గమ్యస్థానాల్లోను వర్తింపచేస్తామని, మొత్తం 120దేశాలు ఆసియా పసిఫిక్‌ నెట్‌వర్క్‌లోను, పశ్చిమాసియా, అమెరికా దేశాలకు సైతం వర్తిస్తుందని ఎయిర్‌ఏసియా వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com