జెడ్డా నుంచి వచ్చిన పిల్లి.. కొచ్చి విమానాశ్రయంలో నిర్బంధం!

- March 04, 2018 , by Maagulf
జెడ్డా నుంచి వచ్చిన పిల్లి.. కొచ్చి విమానాశ్రయంలో నిర్బంధం!

కేరళ:గల్ఫ్ నుంచి తెచ్చిన పెంపుడు పిల్లిని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు పట్టుకున్నారు. జెడ్డా నుంచి వస్తూవస్తూ ఓ భారత జంట వెంట పెంపుడు పిల్లిని తెచ్చుకున్నారు. మార్చి 2న వీరు సౌదీ ఎయిర్‌లైన్స్‌లో కొచ్చి చేరుకున్నారు. వెంట పిల్లి ఉండడాన్ని గమనించిన కస్టమ్స్ అధికారులు దానిని స్వాధీనం చేసుకుని నిర్బంధించారు. ఈ విమానాశ్రయంలో పెంపుడు జంతువులను తెచ్చుకునే విషయంలో నిషేధం ఉండడంతో వారు వెంటనే సౌదీ ఎయిర్‌లైన్స్‌కు సమాచారం అందించారు. పిల్లిని భారత్‌కు తెస్తున్నట్టు ఎటువంటి డాక్యుమెంట్లు లేకపోవడంతో పిల్లిని తిరిగి జెడ్డాకు పంపాలని కోరారు.
 
పెంపుడు జంతువులను తెచ్చుకోవాలంటే, ఆయా దేశం నుంచి దాని హెల్త్ సర్టిఫికెట్ కూడా తెచ్చుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాల్లో మాత్రమే పెంపుడు జంతువులను అనుమతిస్తారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com