దుబాయ్ బోట్ షో 2018 ను సందర్శించిన మొహమ్మద్ బిన్ రషీద్

- March 04, 2018 , by Maagulf
దుబాయ్ బోట్ షో 2018 ను సందర్శించిన మొహమ్మద్ బిన్ రషీద్

దుబాయ్:వైస్ ప్రెసిడెంట్  దుబాయ్ పాలకుడు, ప్రధాని, ప్రధాని షైక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ దుబాయ్ అంతర్జాతీయ పడవల ప్రదర్శన 2018 ను ఆదివారం సందర్శించారు . పలువురు ప్రదర్శనకారులు నావికకారులు ఈ  భారీ కార్యక్రమంలో పాల్గోవడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్వహించిన ఈ ప్రదర్శన 26 వ ఎడిషన్ కాగా  దుబాయ్ ఇంటర్నేషనల్ మెరైన్ క్లబ్ సహకారంతో  దుబాయ్ వాటర్ కెనాల్, జ్యూయిమా వద్ద  దుబాయ్ బోట్ షో 2018 నిర్వహించబడింది. శ్రీ శ్రీ  షేక్ మహ్మద్ స్థానికంగా తయారైన పడవలను పరిశీలించి హైటెక్ పరికరాలను ఉపయోయించే స్థానిక యాచ్ కంపెనీల సమర్ధత తీరుని తనిఖీ చేశారు. అంతర్జాతీయ తయారీదారులతో పోటీ పడాలని సూచించారు దుబాయ్ బోట్ షో 2018 లో ఈ ఏడాది ఎడిషన్ లో మొత్తం 845 అంతర్జాతీయ కంపెనీలు పాల్గొంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రదర్శనకారులను శ్రీ శ్రీ  షేక్ మహ్మద్ సాదరంగా ఆహ్వానించారు. గల్ఫ్ సమాఖ్య  దేశాల (జిసిసి) ప్రాంతంలో కొత్త మార్కెట్ల వినియోగదారుల కోసం చూసే అంతర్జాతీయ ప్రదర్శనకారులను స్వాగతించారు, ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా సందర్శకులు పెద్ద సంఖ్యలో ప్రదర్శనకారులు పలు ప్రాంతాల నుంచి ఇక్కడకు రావడంతో తత్వ సాంస్కృతిక, వారసత్వం మరియు చారిత్రాత్మక ప్రదేశాలు గురించి తెలుసుకోవడానికి అవకాశం కల్గింది.ఈ ప్రదర్శనలో 20 లగ్జరీ పడవలు, యుఎఇ-ఆధారిత షిప్యార్డ్, గల్ఫ్ హస్త కళలు మరియు సాంప్రదాయాలు ఇక్కడ అలరిస్తాయి. 72 ఎం ఆస్టల్ మెగా యాచ్ 86 మీటర్ల షిప్ యార్డ్ లో ప్రధానంగా ఒక మెగా యాచ్ తో సహా ప్రదర్శనలను ఆకట్టుకొన్నాయి. శ్రీ ఖలీఫా దుబాయ్ లో   ప్రోటోకాల్ అండ్ హాస్పిటాలిటీ విభాగ డైరెక్టర్ జనరల్ సయీద్ సులేమాన్, టూరిజం అండ్ కామర్స్ మార్కెటింగ్ విభాగం యొక్క డైరెక్టర్ జనరల్ హేలాల్ సయీద్ అల్మరిరి ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com