ఆన్‌ బోర్డ్‌ ఫ్లైట్‌లో భారత మహిళ మృతి

- March 05, 2018 , by Maagulf
ఆన్‌ బోర్డ్‌ ఫ్లైట్‌లో భారత మహిళ మృతి

మస్కట్‌: సౌదీ అరేబియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో ఓ మహిళకు మెడికల్‌ ఎమర్జన్సీ అవసరమయ్యింది. ఈ నేపథ్యంలో విమానం మస్కట్‌కి డైవర్ట్‌ చేశారు. అయితే దురదృష్టవశాత్తూ ఆ మహిళ మృతి చెందినట్లు మస్కట్‌లోని ఇండియన్‌ ఎంబసీ అధికార ప్రతినిథి పేర్కొన్నారు. 65 ఏళ్ళ మహిళ సౌదీ అరేబియా నుంచి హైద్రాబాద్‌కి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మదీనా నుంచి మార్చి 1న విమానంలో ఆమె హైద్రాబాద్‌కి పయనమయ్యారు. ఆమెతోపాటు విమానంలో ఇద్దరు గ్రాండ్‌ చిల్డ్రన్‌ కూడా ఉన్నారు. ఉమ్రా ప్రార్థనల కోసం హైద్రాబాద్‌ నుంచి ఆమె మదీనా వెళ్ళినట్లు తెలుస్తోంది. షరీఫా బేగమ్‌ అనే మహిళకు మెడికల్‌ ఎమర్జన్సీ అవసరమవడంతో మదీనా నుంచి హైద్రాబాద్‌ వెళ్ళాల్సిన విమానాన్ని మస్కట్‌కి డైవర్ట్‌ చేయడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com