పూర్తి మహిళా సిబ్బందితో ఎయిరిండియా విమాన సర్వీసు

- March 05, 2018 , by Maagulf
పూర్తి మహిళా సిబ్బందితో ఎయిరిండియా విమాన సర్వీసు

ఎయిరిండియా విమానసంస్థ ప్రత్యేక విమానాన్ని నడుపుతోంది. పూర్తి మహిళా సిబ్బందితో కోల్‌కతా-డిమాపూర్‌-కోల్‌కతా సెక్టార్‌లో ఈ విమానాన్ని నడుపుతోంది. ఏఐ709, ఎయిర్‌బస్‌ 319కు కాక్‌పిట్‌ సిబ్బందిగా కెప్టెన్‌ ఆకాంక్ష వర్మ, కెప్టెన్‌ సతోవిసా బెనర్జీ, క్యాబిన్‌ సిబ్బందిగా డి భుటియా, ఎంజీ మోహన్రాజ్‌‌, టీ ఘోస్‌, యతటిలి కత్‌లు ఉన్నారని ఒక ప్రకటనలో తెలిపింది. ఎయిరిండియా సీనియర్‌ సిబ్బంది ఈ విమానానికి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com