ఫ్లాట్ లో ప్రియురాలు అనుమానాస్పదరీతిలో మృతి షార్జా పోలీసుల అదుపులో ప్రియడు

- March 05, 2018 , by Maagulf
ఫ్లాట్ లో ప్రియురాలు అనుమానాస్పదరీతిలో మృతి షార్జా పోలీసుల అదుపులో ప్రియడు

షార్జా: ' ప్రేమించుకోవడంలో అడ్డురాని అవరోధాలు...పెళ్లి మాట ఎత్తితే సవాలక్ష సందేహాలు కొందరు ప్రేమికులలో ఎదురవుతాయి '..దాదాపు ఎక్కడైనా ఇదే ధోరణి ప్రేమికులలో కనబడుతుంది. షార్జాలో ఇరువురు ప్రవాసీయులు కొంతకాలంగా  గాఢంగా ప్రేమించుకున్నారు. ఒకే ఫ్లాట్‌‌లో చాలాకాలంగా సహజీవనం సైతం చేస్తున్నారు. పెళ్లి ఎపుడు చేసుకొందామని అడిగిన ట్యూనీషియాకు చెందిన యువతి కోరికను తేలిగ్గా కొట్టిపారేశాడు. పెళ్లి చేసుకోనని ఆ దుర్మార్గ  ప్రియుడు చెప్పాడు. ఇక ముందు సైతం  ఆ మాట మర్చిపోవడం మేలని ఖరాఖండిగా చెప్పాడు. దీంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది‘‘ నీవు కనుక నన్ను పెళ్లి చేసుకోక పోతే నేను ఈ లోకంలో ఉండను.. .ఆత్మహత్య చేసుకుంటాను’’ అని ఆ యువతి హెచ్చరించింది. కఠిన మనస్కుడైన యువకుడు " నీవు చచ్చిపోతే , నేను హ్యాపీ గా ఉంటాను ' అని తెగేసి చెప్పాడు. అనంతరం పూటుగా మద్యం తాగి హాయిగా పడుకొన్నాడు. మనసు ఎంతో గాయపడిన ఆ యువతీ ఓ గదిలోనికి వెళ్లి తలుపులు మూసి ఫ్యాన్ కు ఉరివేసుకుని చనిపోయింది. కొన్ని గంటల అనంతరం మత్తు దిగి మెలకువ వచ్చిన యువకుడు ఆమె కోసం వెతకడం ప్రారంభించాడు. ఓ గది తలుపులు మూసి ఉండటంతో తలుపులు తెరవాలంటూ యువతిని కోరాడు. లోపల నుంచి ఎటువంటి చప్పుడు రాకపోవడంతో అనుమానం కల్గిన ఆ యువకుడు ఆ గది తలుపులు విరగగొట్టాడు లోపలకు తొంగి చూడగా యువతి మృతిచెందిందని గుర్తించాడు. తేరుకున్న ఆ ప్రియుడు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ అధికారులు, క్లూస్ టీం అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్లాట్ లో వేలి ముద్రలతోసహా ఇతర ఆధారాలను సేకరించారు. యువకుడు చెపుతున్న విషయాలను తాము ఏమాత్రం విశ్వసించడం లేదని, ఈ కేసుని తాము హత్యగానే పరిగణిస్తున్నామని, ఫోరెన్సిక్ నివేదికలో వచ్చిన తర్వాతే మరింత సమాచారం తెలియచేస్తామని పోలీసులు తెలిపారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నామని, ఈ కేసుపై విచారణ జరగనుందని పోలీసులు వెల్లడించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com