దుబాయ్ విల్లాలో దొంగతనం చేసిన ఐదుగురు శ్రీలంక నిందితులపై విచారణ
- March 05, 2018
దుబాయ్:ఉపాధి కోసం పరాయి దేశం వెళ్లిన ఐదుగురు శ్రీలంక వ్యక్తులకు ఓ దుర్బుద్ధి పుట్టింది..దేశం కానీ దేశంలో తమ చోరకళ ప్రదర్శించి నాలుగురాళ్లు వెనకేద్దామను కొన్నారు. కానీ, పట్టుమని పదిరోజులు గడిచేసరికి అనూహ్యంగా ఎనిమిది కట కటాల జైలుగదిలోనికి వెళ్లిపోయారు. వివరాలలోకి వెళితే, అయిదుగురు నిందితులు ఎవరూ లేని తాళాలు పెట్టి ఉన్న ఒక బంగళాను ఎంచుకొన్నారు. ఆ ఇంటి తాళాలు..తలుపులు పగలగొట్టి లోపలకు ప్రవేశించి పలు విలువైన బంగారు ఆభరణాలతో పాటు 50,000 ధిర్హాంల కన్నా ఎక్కువ నగదు దొంగతనం చేశారు. దాదాపు రెండేళ్ల క్రితం జరిగిన ఈ చోరీ కేసు సోమవారం విచారణకు వచ్చింది. స్థానిక కోర్టు అఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ లో ఈ దొంగతనం చేసిన అయిదుగురు నిందితులపై విచారణ జరిగింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ రికార్డుల్లో ఈ దొంగతనంకు పాల్పడిన వారి వయస్సు 29 నుండి 49 ఏళ్ళ మధ్య ఉంది. వీరు మిర్డిఫ్ ప్రాంతంలోని ఒక బంగాళా లోపలకు ప్రవేశించి తాళాలు పగలగొట్టి లోపలకు ప్రవేశించి 50,000 ధిర్హాంల కన్నా ఎక్కువ నగదు అపహరించారు అలాగే బంగారు మరియు డైమండ్ నెక్లెస్, మూడు బంగారు చెవిపోగులు, జుట్టులో పెట్టుకొనే బంగారు పిన్నులు , రెండు గడియారాలు మరియు రెండు పర్సులు 15,000 ధిర్హాంల నగదును దొంగిలించారు. "జూలై 8 వ తేదీ 2016 న నేను నా వార్షిక సెలవులో యూఏఈ వెలుపల మూడు రోజుల పాటు ఉన్నాను, నా బంగాళాలో పనిచేసే తోటమాలి వద్ద నుండి ఒక ఫోన్ కాల్ వచ్చింది, మీరు ప్రధాన ద్వారం తలుపు తెరిచి వెళ్లిపోయారా ? అలాగే వెలుపల ఓ కుర్చీని వదిలిపెట్టారాని నన్ను అడిగాడని దుబాయిలో ఒక ప్రొఫెసర్ గా పనిచేస్తున్న 50 ఏళ్ల పాకిస్తానీ ఫిర్యాదుదారుడు చెప్పారు. అజ్మాన్ లో నివసించిన నా మేనల్లుడిని నా విల్లాకు వెళ్లి పరిశీలించమని సూచించినట్లు అయితే అక్కడ పరిస్థితిని పరిశీలించిన మా బంధువు విల్లా తలుపులు ఎవరో పగలుకొట్టారని ఇంటిలో సామాను చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు నాకు తెలిపాడని పేర్కొన్నాడు. దొంగతనం జరిగిన అయిదు రోజుల తర్వాత నేను నా ఇంటికి వచ్చి బంగారం, వజ్రాల ఆభరణాలు పోయినట్లు గుర్తించినట్లు ఆయన వివరించారు. దొంగిలించిన మొత్తం విలువ 50,000 రూపాయలు ఉంటుందని ఆ ప్రొఫసర్ విలేకరుల ఎదుట వాపోయారు. దోపిడీ జరిగిన పది రోజుల అనంతరం జూలై 18 వ తది 2016 న షార్జాలో అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు నిందితులను పట్టుకున్నామని పోలీసు యంత్రానగం పేర్కొంది. పోలీసులు తమదైన శైలిలో ఇచ్చిన ఆతిధ్యానికి ఇతర సహచర దొంగల సమాచారం ఇచ్చారు. దీంతో అయిదుగురు నిందితులపై కేసు నమోదు చేసి న్యాయ విచారణ అధికారుల ఎదుటకు ప్రవేశపెట్టారు.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







