ఒమన్‌లో బస్సు ప్రమాదం: ముగ్గురు స్కూల్ స్టూడెంట్స్ మృతి
- March 05, 2018
మస్కట్: జబల్ అఖ్‌దర్ స్కూల్‌కి చెందిన ముగ్గురు స్టూడెంట్స్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. స్కూల్ బస్ డ్రైవర్, కంట్రోల్ తప్పడమే ఈ ప్రమాదానికి కారణంగా రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. నిజ్వా విలాయత్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 12 మంది మేల్ స్టూడెంట్స్ ఉన్నారు. వీరిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, తొమ్మిదిమందికి గాయాలయ్యాయి. గాయాలపాలైనవారిని జబల్ అఖ్దర్ హెల్త్ సెంటర్‌కి తరలించారు. ప్రమాదం గురించి తెలియగానే సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది గాయపడ్డవారిని ఎయిర్ లిఫ్ట్ చేసినట్లు తెలిపారు పోలీసులు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన రాయల్ ఒమన్ పోలీస్, గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులు సూచించారు.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







