డొమెస్టిక్‌ ఉమ్రా ఫిలిగ్రిమ్స్‌కి రుసుము లేదు

- March 05, 2018 , by Maagulf
డొమెస్టిక్‌ ఉమ్రా ఫిలిగ్రిమ్స్‌కి రుసుము లేదు

జెడ్డా: మినిస్ట్రీ ఆఫ్‌ హజ్‌ అండ్‌ ఉమ్రా, సోషల్‌ మీడియాలో ఉమ్రా రుసుముపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించింది. డొమెస్టిక్‌ ఉమ్రా పిలిగ్రిమ్స్‌పై రుసుము విధించబోతున్నారంటూ రూమర్స్‌ వినవస్తుండగా, వాటిని మినిస్ట్రీ ఖండించింది. డొమెస్టిక్‌ ఉమ్రా ఫిలిగ్రిమ్స్‌ నుంచి 400 - 700 సౌదీ రియాల్స్‌ని 18 ఏళ్ళకు పైబడ్డవారి దగ్గరనుంచి రుసుముగా వసూలు చేస్తున్నారని రూమర్స్‌ సోషల్‌ మీడియాలో స్ప్రెడ్‌ అయ్యాయి. ఎయిర్‌పోర్ట్స్‌, అలాగే మక్కా ఎంట్రీ పాయింట్స్‌ వద్ద ప్రత్యేకంగా అధికారుల్ని నియమించి ఈ రుసుముల్ని వసూలు చేయనున్నట్లు ఆ రూమర్స్‌ పేర్కొంటున్నాయి. అయితే ఈ రూమర్స్‌ని మినిస్ట్రీ ఖండించింది. యాత్రీకులకు సకల సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామనీ, 2020 నాటికి యాత్రీకుల సంఖ్య 15 మిలియన్లకు చేరుకుంటుందనీ, 2030 నాటికి ఈ సంఖ్య 30 మిలియన్లకు చేరుకోవచ్చని మినిస్ట్రీ పేర్కొంది.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com