డొమెస్టిక్ ఉమ్రా ఫిలిగ్రిమ్స్కి రుసుము లేదు
- March 05, 2018
జెడ్డా: మినిస్ట్రీ ఆఫ్ హజ్ అండ్ ఉమ్రా, సోషల్ మీడియాలో ఉమ్రా రుసుముపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించింది. డొమెస్టిక్ ఉమ్రా పిలిగ్రిమ్స్పై రుసుము విధించబోతున్నారంటూ రూమర్స్ వినవస్తుండగా, వాటిని మినిస్ట్రీ ఖండించింది. డొమెస్టిక్ ఉమ్రా ఫిలిగ్రిమ్స్ నుంచి 400 - 700 సౌదీ రియాల్స్‌ని 18 ఏళ్ళకు పైబడ్డవారి దగ్గరనుంచి రుసుముగా వసూలు చేస్తున్నారని రూమర్స్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యాయి. ఎయిర్‌పోర్ట్స్, అలాగే మక్కా ఎంట్రీ పాయింట్స్ వద్ద ప్రత్యేకంగా అధికారుల్ని నియమించి ఈ రుసుముల్ని వసూలు చేయనున్నట్లు ఆ రూమర్స్ పేర్కొంటున్నాయి. అయితే ఈ రూమర్స్‌ని మినిస్ట్రీ ఖండించింది. యాత్రీకులకు సకల సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామనీ, 2020 నాటికి యాత్రీకుల సంఖ్య 15 మిలియన్లకు చేరుకుంటుందనీ, 2030 నాటికి ఈ సంఖ్య 30 మిలియన్లకు చేరుకోవచ్చని మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







