ఆస్కార్ ట్రోపీని దొంగలించాడు..

- March 06, 2018 , by Maagulf
ఆస్కార్ ట్రోపీని దొంగలించాడు..

ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్న మెక్ డోర్మాండ్ కు చేదు అనుభవం ఎదురయింది. ఆమె గెలుచుకున్న ఆస్కార్ అవార్డు ట్రోపీని ఓ దొంగ ఎత్తుకుపోయాడు. రంగంలో దిగిన పోలీసులు దొంగను పట్టుకున్నారు. మెక్ డోర్మాండ్‌కు ఆమె పోగొట్టుకున్న ట్రోపీని తిరిగి అందించారు. కొన్ని గంటల పాటు నెలకొన్న టెన్షన్ వాతావరణం తొలగించారు. అవార్డును తిరిగి పొందిన డోర్మాండ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఆస్కార్ వేడుకలు తర్వాత జరిగిన పార్టీలో 47 ఏళ్ల టెర్రీ బ్రియాంట్ అనే వ్యక్తి ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఒక ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటో ఆధారంగా ఈ దొంగను పోలీసులు పట్టుకున్నారు. టెర్రీ బ్రియాంట్‌కే ఆస్కార్ లభించిందని భావించిన ఫోటోగ్రాఫర్ ..అతని వెనకాలే వెళుతూ ఫోటోలు తీస్తున్నాడు. దీంతో ఏం చేయాలో తోచని బ్రియాంట్ ఫోటోగ్రాఫర్ చేతిలో తాను దొంగలించిన ట్రోపీని పెట్టాడు. అక్కడ నుంచి జారుకోడానికి ప్రయత్నించాడు. ఈలోగా అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ విషయం బయట పడిన కాసేపటికే బ్రియాంట్ కి చెందిన ఓ వీడియో ఫేస్‌బుక్ పేజీలో దర్శనమిచ్చింది. బ్రియాంట్ ఆస్కార్ ట్రోపీని ముద్దాడుతూ అక్కడ ఉన్న వారితో ముచ్చటిస్తున్నాడు. ఇంతలోనే అక్కడివారు అతడితో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. ఆస్కార్ అవార్డు తనకే వచ్చిందా అని భ్రమ కలిగించే విధంగా బ్రియాంట్ ప్రవర్తించాడు. దీంతో అందరూ అతడి ప్రవర్తన నిజమే అనుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com