హైదరాబాద్ చేరుకున్న కువైట్ ఆమ్నెస్టీ బాధితులు

- March 06, 2018 , by Maagulf

హైదరాబాద్:కువైట్ ప్రభుత్వం ప్రకటించిన క్షమాభిక్షను ఉపయోగించుకొని, APNRT సమకూర్చిన ఉచిత టికెట్లతో 25 మంది ప్రవాసాంధ్రులు తొలి విడతలో తిరిగి వచ్చారు. ఈరోజు(06-03-18) ఉదయం 1:30 గంటలకు మొదటి విడతగా ప్రవాసులు జజీరా ఎయిర్ వేస్ లో కువైట్ నుండి హైదరాబాద్ ఎయిర్ పోర్టు కు వచ్చారు ఆ తర్వాత APNRT ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాలలో వారి వారి స్వగ్రామమునకు వెళ్లారు. మొత్తం ౩౦౦౦ వేలమందికి పైగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోనున్నారు. APNRT MRC డైరెక్టర్ చప్పిడి రాజశేఖర్ , స్మార్ట్ విలేజ్ కోఆర్డినేటర్ ఆర్.దినేష్ మరియు ఇతర బృందం హైదరాబాదు ఎయిర్ పోర్టు లో అంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున వీరికి ఘన స్వాగతం పలికారు. 


ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వారందరికి  వారి సొంత ప్రాంతాలలో 3 నెలల పాటు ఉచిత  నైపుణ్యాభివృద్ది శిక్షణ ఇవ్వనున్నట్లు NRI మంత్రి కొల్లు రవీంద్ర , APNRT అధ్యక్షుడు డా.రవికుమార్ పి.వేమూరు మరియు CEO కె. సాంబశివరావు  తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com