లాండ్‌లైన్‌ నంబర్లకూ వాట్సాప్‌!!

- March 07, 2018 , by Maagulf
లాండ్‌లైన్‌ నంబర్లకూ వాట్సాప్‌!!

దిల్లీ : ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ వినియోగించాలంటే మనకు మొబైల్‌ ఫోన్‌ తప్పనిసరి. అయితే లాండ్‌లైన్‌ నంబర్లు ఉన్నవారు ఈ సేవలను వినియోగించుకోలేరు. అయితే వాట్సాప్‌ సేవలు ఇప్పుడు లాండ్‌లైన్‌ నంబర్లకు కూడా అందుబాటులోకి వచ్చాయి. లాండ్‌లైన్‌ నంబర్‌ ఉన్నవారు ఎవరైనా ఈ సేవలను ఎంచక్కా వినియోగించుకోవచ్చు. అయితే ఈ సేవలు పొందడానికి మొబైల్‌ ఫోన్‌ మాత్రం ఉండాల్సిందే.

ఇందుకోసం వాట్సాప్‌ బిజినెస్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని వాణిజ్య సేవల కోసం రూపొందించినప్పటికీ ఎవరైనా మొబైల్‌ ఫోన్లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకున్న అనంతరం రిజిస్టర్‌ నంబర్‌ వద్ద పది అంకెల మొబైల్‌ నంబర్‌ కాకుండా.. లాండ్‌లైన్‌ నంబర్‌ను ఇవ్వాలి. సాధారణంగా ఇలాంటి సందర్భంలో వాట్సాప్‌ మన మొబైల్‌ నంబర్‌కి ఓటీపీ పంపించి వెరిఫై చేస్తుంది. అయితే ఇక్కడ మాత్రం మనం కాల్‌మీ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. లాండ్‌లైన్‌ నంబర్‌కు కాల్‌ వచ్చిన అనంతరం వెరిఫై ప్రక్రియ పూర్తవుతుంది. అనంతరం లాండ్‌లైన్‌ నంబర్‌ను వినియోగించుకునే అన్ని రకాల వాట్సప్‌ సేవలను పొందవచ్చు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com